అన్వేషించండి

Ambani Wedding: కొడుకు పెళ్లి కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

Anant Radhika Wedding: యువరాణి డయానా, ప్రిన్స్ చార్లెస్, షేఖా హింద్ బింట్ బిన్ మక్తూమ్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ల వివాహాల కంటే అంబానీ కుటుంబం చేసిన ఖర్చు చాలా రెట్లు ఎక్కువ.

Anant Radhika Wedding Cost: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12, శుక్రవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కూడా కొన్ని వేడుకలు నిర్వహించారు. నేషనల్‌ మీడియా అంచనాల ప్రకారం, ఈ వెడ్డింగ్ కోసం వేల కోట్ల రూపాయలను వెదజల్లారు. అనంత్ - రాధిక పెళ్లి కోసం ఎంత డబ్బు చేశారో తెలిసి దేశవ్యాప్తంగా జనాలు షాక్ అవుతున్నారు.

పెళ్లికి దాదాపు రూ.5,000 కోట్ల ఖర్చు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి కోసం ముకేష్ అంబానీ దాదాపు రూ. 5000 కోట్లు ఖర్చు చేశారని రెడ్డిట్‌లో ఒక పోస్ట్ సర్క్యులేట్‌ అవుతోంది. ఈ మొత్తం, ముకేష్ అంబానీ నికర విలువలో దాదాపు 0.5 శాతం. ఈ పెళ్లికి రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల వరకు ఖర్చవుతుందని తొలుత భావించారు. కానీ, అందరూ ఊహించిన మొత్తం కంటే చాలా భారీగా, ఎవరి ఊహలకు అందనంత డబ్బును ముకేష్‌ అంబానీ ఖర్చు చేసినట్లు సమాచారం. పెళ్లి కోసం వెచ్చించిన మొత్తంతో 10 సార్లు ఆస్కార్ ఈవెంట్‌ నిర్వహించవచ్చని ఒక యూజర్‌ కామెంట్‌ చేశారు. ఔట్‌లుక్ రిపోర్ట్‌ ప్రకారం, అంబానీ కుటుంబం వారి నికర విలువలో కొంత భాగాన్ని వివాహానికి ఖర్చు చేసింది. సాధారణంగా, భారతీయ కుటుంబాలు, తమ నికర విలువలో 15 శాతం వరకు వివాహానికి ఖర్చు పెడుతున్నాయి.

భారత్‌తో పాటు విదేశాల నుంచి ప్రముఖులు
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల వివాహంతో అంబానీ కుటుంబం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలోని చిరస్మరణీయ కార్యక్రమంగా విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. పెళ్లి పిలుపు అందుకున్న అతిథుల జాబితా ప్రపంచవ్యాప్తంగా ఉంది. బాలీవుడ్, హాలీవుడ్, క్రీడలు, వ్యాపారం, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు పిలుపులు వెళ్లాయి. కిమ్ కర్దాషియాన్, జాన్ సెనా, అడెలె వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కూడా పెళ్లిలో భాగమయ్యారు.

అతిథులకు ఖరీదైన బహుమతులు
పెళ్లికి హాజరైన అతిథులకు ఖరీదైన బహుమతులు, సేవలు అందించారు. ప్రైవేట్ చార్టర్ విమానాల నుంచి లగ్జరీ కార్లు, లూయిస్ విట్టన్ బ్యాగులు, బంగారు గొలుసులు, డిజైనర్ షూలు వంటివన్నీ అతిథులకు అందుబాటులో ఉంచారు. పాప్ సంచలనం జస్టిన్ బీబర్ పెళ్లి వేడుకల్లో అలంకరించాడు. రాపర్లు బాద్షా, కరణ్ ఔజిలా కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటి
వివాహ వేడుకల కోసం దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు జాతీయ మీడియా అంచనా వేసింది. బ్రిటన్‌ యువరాణి డయానా - ప్రిన్స్ చార్లెస్‌ల వివాహం కోసం రూ. 1,361 కోట్లు, షేక్ హింద్ బింట్ బిన్ మక్తూమ్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ వివాహం కోసం రూ. 1,144 కోట్లను ఖర్చు చేశారు. అంబానీ ఇంట పెళ్లి ఖర్చు వాటిని తోసిరాజంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా చెబుతున్నారు. వివాహ వేడుకల్లో అలరించిన రిహానాకు రూ. 74 కోట్లు, జస్టిన్ బీబర్‌కు రూ. 83 కోట్లు ఇచ్చారు. పెళ్లికి ముందు నిర్వహించిన కార్యక్రమాలకు రూ. 2500 కోట్లు ఖర్చు చేసినట్లు డైలీ మెయిల్ కథనం రాసింది.

మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు - PPF కంటే ఎక్కువ వడ్డీ రాబడి 

టాప్ హెడ్ లైన్స్

Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget