APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలు, ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు ఇలా
APSWREIS Admissions: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 6 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విద్యార్థులకు ఏప్రిల్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 189 గురుకులాల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు..
* డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశాలు (బీఆర్‌ఏజీ సెట్-2025)
సీట్ల సంఖ్య: 14,940.
సీట్ల కేటాయింపు: ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. ప్రత్యేక కేటగిరీ కింద 15%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు.
అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2025-26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థులు కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.
వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2016 మధ్య; ఓసీ, బీసీ, బీసీ-సి విద్యార్థులు 01.09.2014 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఎలా చేయాలి..
➥ ఆసక్తిగల విద్యార్థులు అధికారక వెబ్‌సైట్ https://apbragcet.apcfss.in. సందర్శించిన పిదప తమ వివరాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలి.
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 07.02.2025 నుంచి 06.03.2025 వరకు స్వీకరిస్తారు.
➥ విద్యార్థులు సమీపంలోని ఏదైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
➥ విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశానికి ఎంచుకున్న పాఠశాల వివరాలను ఆన్‌లైన్ దరఖాస్తులో తప్పనిసరిగా అందించాలి.
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తును అప్‌లోడ్ చేసిన తర్వాత, ఎటువంటి మార్పులకు అనుమతించరు.
దరఖాస్తు సమయంలో అవసరమైన డాక్యుమెంట్‌లు..
➥ ఎంపికైన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో పాఠశాల ప్రిన్సిపల్‌కు ఈ క్రింది ధృవపత్రాలను సమర్పించాలి.
➥ 5వ తరగతి ప్రవేశానికి 4వ తరగతి రికార్డ్ షీట్ / స్టడీ సర్టిఫికెట్
➥ కాస్ట్ సర్టిఫికెట్
➥ ఇన్కమ్ సర్టిఫికెట్
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC), విద్యార్థులు కేటగిరీ యొక్క ఇతర సంబంధిత సర్టిఫికెట్స్.
➥ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) స్థాయి కంటే తక్కువ కాకుండా మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్.
➥ రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం రిజర్వేషన్ క్లెయిమ్ చేయబడితే సంబంధిత సర్టిఫికేట్.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 50 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో తెలుగు-10 ప్రశ్నలు-10 మార్కులు, ఇంగ్లిష్ 10 ప్రశ్నలు-10 మార్కులు, మ్యాథమెటిక్స్ 15 ప్రశ్నలు-15 మార్కులు, ఈవీఎస్ 15 ప్రశ్నలు-15 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. 4వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 06.03.2025.
➥ అడ్మిట్‌కార్డుల విడుదల: 01.04.2025.
➥ ప్రవేశ పరీక్ష తేదీ: 06.04.2025.
పరీక్ష సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

