అన్వేషించండి

అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

ఏపీలో అదానీ- సౌరవిద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ మోహనరెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది.

 

అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, ఆయన కంపెనీ సహచరులపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో.. ఆంధ్రప్రదేశ్‌లో అంతకు మించి దుమారం రేగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి భారీ ముడుపులు ఆంధ్రప్రదేశ్‌లోనే అందినట్లు యు.ఎస్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దాదాపు 1750కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వ పెద్దలకు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం జగన్మోహనరెడ్డి ప్రోద్భలంతో అదానీ సంస్థకు లబ్ది చేకూరేలా ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని రద్దు చేసి.. విచారణ జరిపించాలని డిమాండ్లు మొదలయ్యాయి.

 

మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు అనుచిత లబ్ది చేకూర్చినందుకు గాను మాజీ సీఎం జగన్ మోహనరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద మాజీ సీఎం జగన్‌తో పాటు, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు.

 

అవినీతిపై కీలక ఆధారాలున్నాయి.

డిసెంబర్ 1,2021 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా -SECI నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కిలోవాట్ 2.42 పైసలకు కొనేవిధంగా దీనిని మరో 7 పైసలు పెంచుకునేవిధంగా 25 ఏళ్లకు ఒప్పందం చేసుకుందని .. కానీ అదే సమయానికి గుజరాత్ లో 1.99పైసలకే యూనిట్ విద్యుత్‌ను  కొంటున్నారని చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయానికి ప్రజలపై భారం పడుతోందని మాత్రమే తాము అనుకున్నామని కానీ ఇటీవల గౌతం అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడ సెక్యూరిటి ఎక్సేంజెస్ కమిషన్ SEC చేసిన ఫిర్యాదుతో ఇందులో భారీ అవినీతి జరిగినట్లు బయటకు వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఛైర్మన్ గౌతం అదానీ ద్వారా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి  జగన్ మోహనరెడ్డికి 1750కోట్లు అందినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.  SECI ద్వారా ఏపీకి అదానీ గ్రీన్ ఎనర్జీని అందించేందుకు ఈ డీల్ కుదిరినట్లు అమెరికా అధికారులు చెప్పారని గుర్తు చేశారు.


అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

 

సీఎంకే ముడుపులు అందాయి

SEC కోర్టుకు సమర్పించిన నివేదికలోని 54 వ పేరాను చక్రవర్తి కంప్లెయింట్ లో పొందుపరిచారు. దాని ప్రకారం “ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోనే చూసుకుంటే..  సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 7000 మెగావాట్లు విద్యుత్ అందించేందుకు సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం ఒక్కో మెగావాట్‌ కు 25లక్షల చొప్పున అందించేందుకు అంగీకరించామని Azure ( అదానీ యు.ఎస్ పార్టనర్ )  ప్రతినిధులకు  అహ్మదాబాద్‌లో జరిగిన వ్యక్తిగత సమావేశం లోచెప్పారు. ఈ లెక్కన 7 వేల మెగావాట్లకు 1750కోట్లు (200మిలియన్$) చెల్లించారు. ఇందులో CMతో సహా ప్రభుత్వ అధికారులకు ముడుపులు అందాయి.”  అని ఉంది. 

 

విచారణ చేపట్టాలి 

గౌతం అదానీపై యు.ఎస్ లో నమోదైన కేసును అనుసరించి ఏపీలో ముడుపులు ముట్టినట్లు అర్థం అవుతోందన్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం.. అర్థరాత్రి హడావిడిగా ఒప్పందంపై తన సంతకాన్ని అడిగారని చెప్పారని ఆయనతో బలవంతంగా సంతకం తీసుకున్నారన్న విషయం కూడా తెలుస్తోందాన్నారు.  అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు లబ్ది చేకూరేలా అప్పటి సీఎం వ్యవరించి ప్రజలను మోసగించారని.. అందుకోసం జగన్ పై, అప్పటి మంత్రి బాలినేని, ఇంధన కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీలపై కేసులు నమోదు చేసి విచారించాలని ఫిర్యాదులో కోరారు.

 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget