అన్వేషించండి

Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!

Maruti Suzuki: భారతదేశ నంబర్ వన్ కార్ల బ్రాండ్ మారుతి సుజుకి ఎగుమతుల్లో కూడా రికార్డును సృష్టించింది. 30 లక్షల కార్లను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కార్ల బ్రాండ్‌గా నిలిచింది.

Maruti Suzuki Achieves Big Milestone: మారుతి సుజుకి భారతదేశంలోనే నంబర్ వన్ కార్ సెల్లింగ్ కంపెనీ. ఇప్పుడు ఎగుమతుల్లో కూడా మంచి రికార్డును సాధించింది. ప్రస్తుతం అనేక దేశాలకు 30 లక్షల కార్లను ఎగుమతి చేయడం ద్వారా మరోసారి పెద్ద మైలురాయిని సాధించింది. ఈ విధంగా మారుతి సుజుకి భారతదేశం నుంచి అత్యధిక కార్లను ఎగుమతి చేస్తున్న కంపెనీగా అవతరించింది. భారతదేశంలో కూడా అత్యధిక కార్లను విక్రయిస్తున్న కంపెనీగా కూడా ఈ కారు నిలిచింది.

30 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కొత్త మైలురాయిని చేరుకున్నట్లు  కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి చాలా సంవత్సరాలుగా భారతదేశంలో కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు 30 లక్షల కార్లు ఎగుమతి చేయడం అనేది ఒక పెద్ద విజయం అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఏ దేశాల్లో కార్లను విక్రయిస్తోంది?
మారుతి సుజుకి ప్రస్తుతం భారతదేశంలో తయారైన కార్లను ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. సుజుకి అంతర్జాతీయంగా కార్లను విక్రయిస్తుంది. మారుతి సహకారంతో భారతదేశంలో కార్లను తయారు చేయడంతో పాటు విక్రయిస్తుంది. దీంతో పాటు భారతదేశంలో తయారు అవుతున్న మారుతి సుజుకి కార్లు ఇప్పుడు విదేశాలలో కూడా అమ్ముడవుతున్నాయి.

Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!

మారుతి సుజుకి కార్ల ఎగుమతి గణాంకాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉందని చూపిస్తుంది. ఎగుమతుల్లో ముందున్న లేదా అత్యధిక డిమాండ్ ఉన్న కార్లలో మారుతి సుజుకి సెలెరియో, ఫ్రాంక్స్, సియాజ్, డిజైర్, బలెనో, ఎస్ ప్రెసో వంటి ఫేమస్ కార్లు ఉన్నాయి. గత మూడేళ్లలో కంపెనీ ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. కంపెనీ కార్లు అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రశంసలు పొందాయి. దాని కారణంగా అమ్మకాలు పెరిగాయి.

ఎగుమతి ఎప్పుడు ప్రారంభమైంది?
మారుతి సుజుకి 1986లో భారతదేశం నుంచి వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది. 500 కార్ల మొదటి పెద్ద షిప్‌మెంట్‌ను 1987 సెప్టెంబర్‌లో హంగేరీకి పంపారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10 లక్షల వాహనాలను ఎగుమతి చేసి మొదటి మైలురాయిని సాధించింది. దీని తరువాత 2020-21 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల యూనిట్ల ఎక్స్‌పోర్ట్ మార్కును తాకింది. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల యూనిట్ల మార్కును అందుకుంది. మొదటి 10 లక్షల మార్కును అందుకోవడానికి 27 సంవత్సరాలు పట్టగా... 10 నుంచి 20 లక్షలకు చేరడానికి తొమ్మిది సంవత్సరాలే పట్టింది. ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే తదుపరి 10 లక్షల యూనిట్లను అంటే 20 లక్షల నుండి 30 లక్షల యూనిట్ల సంఖ్యను కంపెనీ తాకింది.

మారుతి సుజుకి కంపెనీ చాలా తక్కువ ధరలో కార్లను విక్రయిస్తుంది. దేశంలో ఎక్కువ మంది ఈ కంపెనీ కార్లను ప్రిఫర్ చేయడానికి కారణం కూడా అదే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన కారు ఆల్టో. దాన్ని విక్రయిస్తుంది కూడా మారుతి సుజుకినే. ప్రస్తుతం కార్లలో సేఫ్టీ ఫీచర్లపై కూడా మారుతి సుజుకి దృష్టి పెట్టింది.

Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌తో Maruti WagonR Automatic కొంటే చెల్లించాల్సిన EMI ఎంత
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌తో Maruti WagonR Automatic కొంటే చెల్లించాల్సిన EMI ఎంత
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget