India Bags 4 Paralympic Medals | గురి కుదిరింది...పారిస్ పారాలింపిక్స్ లో భారత్ పతకాల మోత |ABP Desam
పారిస్ లో ప్రారంభమైన పారాలింపిక్స్ లో భారత్ రెండో రోజు పతకాల మోత మోగించింది. ప్రధానంగా షూటింగ్ లో భారత షూటర్లు లక్ష్యాన్ని గురి పెట్టిన కొట్టిన విధానం భారత్ ఖాతాలో ఒక్కరోజే మూడు పతకాలు సాధించేలా చేసింది. ప్రధానంగా మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్..టోక్యో పారాలింపిక్స్ లో లో బంగారు పతకం గెలిచిన అవనీ లేఖారా మరో సారి చరిత్ర సృష్టించారు. పారిస్ పారాలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించిన లేఖారా...వరుసగా రెండు పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఇదే విభాగం కాంస్యపతకమూ భారత్ నే వరించింది. మోనా అగర్వాల్ కాంస్యపతకాన్ని కైవసం చేసుకున్నారు. ఒకే గేమ్ లో భారత్ ఆటగాళ్లే గోల్డ్ అండ్ బ్రోంజ్ కైవసం చేసుకోవటం కూడా ఇదే తొలిసారి. పురుషుల 10మీటర్ల షూటింగ్ లోనూ భారత్ సత్తా చాటింది. టోక్యో పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన మనీష్ నర్వాల్ ఈసారి కూడా అద్భుతంగా పోరాడి సిల్వర్ మెడల్ గెల్చుకున్నాడు. వరుసగా రెండు పారిలింపిక్స్ లోనూ మనీష్ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక భారత్ కు నాలుగో పతకం అథ్లెట్లిక్స్ లో రావటం విశేషం.మహిళల 100మీటర్ల పరుగుపందెంలో భారత రన్నర్ ప్రీతిపాల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తద్వారా పారాలింపిక్స్ లో పరుగుపందెంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా ప్రీతిపాల్ చరిత్ర సృష్టించారు. మొత్తంగా రెండో రోజు ఓ బంగారుపతకం, ఓరజత పతకం, రెండు కాంస్య పతకాలతో భారత్ పతకాల పట్టికలో 10వ స్థానానికి ఎగబాకింది.