అన్వేషించండి

Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.

viral News: మహాకుంభ్‌లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఇది ఒకటి. వీడియో కాల్ తో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.

Woman Dips Her Phone At Triveni Sangam: 144 ఏళ్లకు ఓ సారి వచ్చే మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేయాలని  హిందువులు అందిరికీ ఉంటుంది. అయితే అందరికీ అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే విచిత్రమైన మార్గాలను ఔత్సాహికులు అన్వేషిస్తున్నారు. ఓ వ్యక్తి ఫోటోలకు స్నానం చేయిస్తూ .. వీడియో కాల్ లో చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మరో యువతి అయితే అసలు విడియో కాల్ లో వ్యక్తి ఉండగా ఫోన్ ను మూడు సార్లు మునకేసి.. ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తికి పుణ్యస్నానం చేసేసినట్లుగా ముక్తి ప్రసాదిస్తున్నారు.        

ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర జలాల్లో ఒక మహిళ తన ఫోన్‌ను ముంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రివేణి సంగమం వద్ద ఫోన్‌ను ముంచినప్పుడు ఆమె వీడియో కాల్‌లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఫోన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే ఆందోళన లేకుండా, ఆమె తన భర్తకు నదుల పవిత్ర సంగమంలో వర్చువల్  మునకను ప్రసాదించింది.                            

హిందీ సీరియల్స్‌లోఇంత అమాయకంగా ఓ క్యారెక్టర్ గోపీ బాహు అనే పేరుతో ఈమెను పిలుస్తున్నారు. ఈ మహిళ వీడియో  కాల్ చేసింది తన భర్తకే అని..ఆయన రాలేకపోవడంతో ఇలా ఫోన్ లో వీడియో కాల్ లో పుణ్యస్నానం చేయించినట్లుగా తెలుస్తోంది.   

 

మహా కుంభమేళా  శివరాత్రి పండుగతో ముగుస్తుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భక్తులతో త్రివేణి సంగమం, ప్రయాగ్‌రాజ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నుంచి  మహా కుంభమేళా జరిగే ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదదు. సంగమం పరిసరాలను వెహికల్ ఫ్రీ జోన్‌గా ప్రకటించింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఈ ఆంక్షలు విధించారు. అయితే నిత్యావసరాలను తీసుకువెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.              

దాదాపుగా అరవై కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే దేశంలోని సగం మంది ప్రయాగరాజ్ వచ్చి వెళ్ళారని అనుకోవచ్చు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా..  మహాకుంభమేళా ఎప్పటికప్పుడు ఆయూపీకి కోట్ల మంది రాకపోకలు సాగించారు.                         

Also Read:  ఇండియాపై గెలవకపోతే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదన్నాడు పాకిస్తాన్ ప్రధాని - ఇప్పుడు ఆయనకు ఎన్ని పేర్లు పెడుతున్నారంటే ?

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget