Prime Minister of Pakistan: ఇండియాపై గెలవకపోతే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదన్నాడు పాకిస్తాన్ ప్రధాని - ఇప్పుడు ఆయనకు ఎన్ని పేర్లు పెడుతున్నారంటే ?
Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని పేరు షాబాజ్ షరీఫ్. కానీ ఇప్పుడు అక్కడి ప్రజలు ఆయనకు ఎన్నో పేర్లు పెడుతున్నారు. ఎందుకంటే భారత్ చేతిలో పాకిస్తాన్ టీం ఓడిపోవడమే.

Pakistan PM Shehbaz Sharif: ఈ పందెంలో నేను గెలవకపోతే నేను పుడింగినే కాదని కొంత మంది చాలెంజ్ చేస్తూంటారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి కూడా అలాంటి బాపతే. ఇండియా, పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోపీ మ్యాచ్ దుబాయ్ లో జరగబోతున్న సమయంలో ఓ ప్రచారసభలో ప్రసంగించారు. అక్కడ ఆవేశపడ్డారు. భారత్ పై పాకిస్తాన్ పై గెలవకపోతే తన పేరే షాబాజ్ షరీఫ్ కాదన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
If I don't defeat #India, my name is not Shehbaz Sharif," says PM Shehbaz, pledging to outpace regional rivals like India in development. Speaking in Dera Ghazi Khan, he emphasized the need for unprecedented federal-provincial collaboration to steer Pakistan towards progress.… pic.twitter.com/nQudEuLH2K
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 22, 2025
అయితే చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఆయనపై పాకిస్తాన్ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడేం పేరు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన మధ్య తేడాల్ని చూపిస్తున్నారు.
India: ~$3.7 trillion (5th largest globally), projected to grow at 6-7% annually.
— Instant Info (@InstantInfo07) February 23, 2025
Pakistan: ~$375 billion (about 1/10th of India’s GDP), struggling with 1-3% growth amid economic crises.
India: ~$640 billion in forex reserves, with manageable external debt.
Pakistan: ~$8 billion…
భారతీయులు కూడా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని డైలాగుల్ని ట్రోల్ చేస్తున్నారు.
Sir comedy mein aap bahut aage nikal gaye hai hum indians bahut peeche reh gaye hai baki economy mein aap kam se kam 30 sall peeche hai that too when whole world is giving charity money to u other wise its 100 years
— Akash Puri (@niftybaba2007) February 23, 2025
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు అయిన షాబాజ్ షరీప్ ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్. ప్రసంగిస్తున్న సమయంలో ఆయన దెబ్బకు చాలా సార్లు మైకులుకూడా విరిగిపోతాయి. ప్రజల్ని రెచ్చగొట్టాడనికి అలా ప్రసంగిస్తారో లేకోపతే ఆయనలో అలాంటి ఫైర్ బయటకు వస్తుందో కానీ.. ఎన్నికల ప్రచార సభలతో పాటు ప్రెస్ మీట్లలోనూ ఆయన తగ్గరు. అందుకే ఆయన ఆవేశ పూరిత వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
భారత్ , పాకిస్తాన్ మధ్య ఉంటే దాయాది వైరం కారణంగా క్రికెట్ మ్యాచులను కూడా యుద్ధంగా చూపించి అక్కడి ప్రజల్ని .. రాజకీయ పార్టీలు రెచ్చగొడుతూంటాయి. గెలుస్తామని అనుకున్నారేమో కానీ.. షాబాజ్ షరీఫ్ ఆవేశ పడ్డారు. ఇంటర్నెట్ లో ట్రోలింగ్ కు గురవుతున్నారు.





















