(Source: ECI/ABP News/ABP Majha)
Lakshya Sen vs Viktor Axelsen | Olympics 2024 సెమీస్ లో భారత యువకెరటం దూసుకెళ్తాడా.? | ABP Desam
ఈ ఏడాది భారత్ ఒలిపింక్స్ లో కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ఆశించిన విభాగం బ్యాడ్మింటన్. కానీ దురదృష్టవశాత్తు పీవీ సింధు, డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ లాంటి ఆటగాళ్లు పతకాలు లేకుండానే నిష్క్రమించటంతో పాయింట్ల పట్టికలో భారత్ కూడా చాలా కిందన ఉండిపోవాల్సిన పరిస్థితి. కానీ దాన్ని దూరం చేసేలా బంగారు పతకం మీద ఆశకల్పిస్తున్నాడు ఓ యువకెరటం. అతడే లక్ష్యసేన్. ఈ ఒలిపింక్స్ లో తన కంటే హేమీ హేమీలను మట్టికరిపించి సెమీస్ లో అడుగుపెట్టిన లక్ష్యసేన్..ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ ఆడుతున్న తొలి పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్ గా చరిత్ర లిఖించాడు. కానీ లక్ష్య టార్గెట్ బంగారు పతకమే. దానికి అడ్డంకిగా ఉన్న ఒకే ఒక వ్యక్తితో ఈ రోజు సెమీ ఫైనల్లో తలపడుతున్నాడు లక్ష్య సేన్. డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్సెన్ ను ఢీకొట్టనున్నాడు ఈ రోజు లక్ష్యసేన్. ప్రపంచ మాజీ నెంబర్ 1, వరల్డ్ ఛాంపియన్ అండ్ టోక్యో ఒలింపిక్స్ లో బంగారుపతకం గెల్చుకున్న ఆక్సెల్సెన్ తో లక్ష్య సేన్ ఈ రోజు తలపడాలి. లక్ష్యసేన్ కి ఉన్న అనుభవం దృష్ట్యా వాస్తవానికి ఇది చాలా కష్టమైన మ్యాచ్ అయినా లక్ష్య ఇప్పుడున్న ఫామ్ ను చూస్తుంటే ప్రపంచంలో ఎవ్వరినైనా ఓడించాలానే కనిపిస్తున్నాడు. అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ ఇప్పటివరకూ 8 మ్యాచుల్లో తలపడితే అందులో 7 సార్లు ఓడిపోయి..ఒక్కసారి మాత్రమే గెలిచాడు. ఆ ఒక్కసారి విజయమే స్ఫూర్తిగా ఈ రోజు బరిలోకి దిగుతున్న లక్ష్యసేమ్ మ్యాచ్ గెలిస్తే మాత్రం బంగారు పతకం కోసం పోరులో తలపడే మహత్తరమైన అవకాశాన్ని సాధిస్తాడు. ఓడితే కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.