Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
Sai Pallavi No Make Up Reason: అందం, అభినయంతో నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి సినిమాలలో కూడా మేకప్ లేకుండానే కన్పిస్తుంది. మరి ఆమె ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) తెరపై మేకప్ లేకుండా కూడా అందంగా మెరిసిపోతుంది. సాధారణంగా హీరోయిన్లు సినిమాల విషయంలో ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోరు. మేకప్ లేనిదే ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించడానికి ఇష్టపడరు. ప్రేక్షకులను గ్లామర్ తో తమ వైపుకు తిప్పుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం వీరందరికీ విరుద్ధంగా తనదైన స్టైల్ లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. సాంప్రదాయబద్ధంగా, మేకప్ లేకుండా నేచురల్ గా కనిపించే సాయి పల్లవికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరి సాయి పల్లవి ఎందుకు సినిమాల్లో మేకప్ వేసుకోదని ఎప్పుడైనా ఆలోచించారా? ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది.
సాయి పల్లవి ఎందుకు మేకప్ వేసుకోదు?
డ్యాన్సర్ గా కెరియర్ ను మొదలు పెట్టి, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ స్థాయికి ఎదిగింది సాయి పల్లవి. కేవలం టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ అమ్మడు అస్సలు మేకప్ వేసుకోదు. ఇటీవల ఆమె నటించిన 'తండేల్' రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ చందూ మొండేటి సైతం సాయి పల్లవి మేకప్ వేసుకోవడానికి ఇష్టపడదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కేవలం సన్ స్క్రీన్ తోనే సరిపెడుతుందని ఆయన వెల్లడించారు. ఇదేవిధంగా గతంలోనూ సాయి పల్లవి మేకప్ లేకుండా సినిమాల్లో నటించడం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
"మేకప్ ఎందుకు వేసుకోరు ?" అనే ప్రశ్నకు సాయి పల్లవి స్పందిస్తూ "స్క్రీన్ పై అందంగా కన్పించడానికి మేకప్ హెల్ప్ అవ్వదని నేను చెప్పను. కానీ మీకు మేకప్ వేసుకుంటేనే అందంగా కనిపిస్తామని నమ్మకం కలిగితే అలా చేయొచ్చు. నేను మాత్రం మేకప్ లేకుండానే నాపై నేను నమ్మకంతో ఉంటాను. ఇలా కూడా నేను బాగుంటానని భావిస్తున్నాను. నిజానికి సినిమాలో భిన్నమైన దుస్తులు, హెయిర్ స్టైల్ చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మేకప్ కంటే సినిమాలో పాత్ర అనేది చాలా ముఖ్యం. ఒకే లక్షణాలు ఉన్న పాత్రలను పోషిస్తే, పెద్దగా తేడా ఉండదు. కానీ డిఫరెంట్ రోల్స్ చేస్తే సినిమా సినిమాకు లుక్ మారినట్టే. ఎందుకంటే ఒక్కో పాత్రలో ఒక్కో రకంగా ఎమోషన్స్ ను పలికించాల్సి ఉంటుంది. అయితే దీనికి మేకప్ తో పని లేదని నేను అనుకుంటున్నాను" అని వెల్లడించింది.
Also Read: 'ఆయనకు పీపుల్ స్టార్ ట్యాగ్ ఉందని తెలియదు' - ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదన్న హీరో సందీప్ కిషన్
ఫ్లూయెంట్‌గా ఇన్ని భాషలు మాట్లాడుతుందా ?
సాయి పల్లవి ఇప్పటికే 6 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులను, 2 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డుల సహా కోట్లాది మంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ అమ్మడు 2017లో 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ధనుష్, సూర్య, నాని వంటి స్టార్ హీరోలతో నటించింది. కోయంబత్తూర్ లో జన్మించిన సాయి పల్లవి కేవలం నటి మాత్రమే కాదు డాక్టర్ కూడా. ఇక ఆమె తమిళంతో పాటు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, జార్జియన్ భాషల్లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలదు. రీసెంట్ గా 'అమరన్', 'తండేల్' సినిమాలతో రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 'రామాయణం' సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతోంది.





















