Officer On Duty OTT release: ప్రియమణి మలయాళ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' - త్వరలోనే ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Officer On Duty OTT Platform: కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఈ నెల 20న మూవీ థియేటర్లలోకి రిలీజ్ కాగా.. త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

Officer On Duty OTT Release On Netflix: హీరో కుంచాకో బోబన్ (Kunchacko Boban), ప్రియమణి (Priyamani) లీడ్ రోల్స్‌లో నటించిన మలయాళ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఈ నెల 20న థియేటర్లలో రిలీజైన మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. జిత్తు అష్రఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రక్కత్, రెంజిత్ నాయర్, సీబీ చవర నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా మార్చి 20 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
మూవీ కథేంటంటే..?
View this post on Instagram
ఈ కథ కొచ్చిలో సీఐగా పని చేస్తోన్న హరిశంకర్ చుట్టూ తిరుగుతుంది. అతని భార్య గీత, కుమార్తెతో కలిసి ఉంటాడు. స్ట్రిక్ట్ అండ్ డిసిప్లీన్‌గా ఉండే పోలీస్ ఆఫీసర్ హరిశంకర్.. ఆయన టీం కూడా అలానే ఉండాలని అనుకుంటారు. నగరంలో నకిలీ బంగారు ఆభరణాల కేసు లోతుగా ఇన్విస్టిగేషన్ చేస్తుండగా.. మరిన్ని క్రైమ్స్ బయటపడతాయి. ఈ క్రమంలోనే సెక్స్ రాకెట్, డ్రగ్స్ కేసులు సైతం బయటపడుతుండగా.. మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వీటన్నింటికీ నకిలీ బంగారు ఆభరణాల కేసుకు సంబంధం ఏంటి.?, అసలు నిందితుడు ఎవరు.?, నిందితుడు చేసిన మిగిలిన క్రైమ్స్ ఏవి.? ఈ కేసుల పరిష్కారంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొన్న పరిణామాలేంటి.? వంటి విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఆద్యంతం ట్విస్టులు, సస్పెన్సులతో మూవీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
ప్రియమణి.. టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. 2003లో వచ్చిన 'ఎవరే అతగాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత జగపతిబాబు 'పెళ్లైన కొత్తలో'తో అలరించారు. అనంతరం దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'యమదొంగ'తో స్టార్‌గా మారిపోయారు. ఆ తర్వాత నవ వసంతం, ద్రోణ, హరే రామ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత నారప్ప, భామాకలాపం, కస్టడీ మూవీలతో అలరించారు.
Also Read: 'సారంగపాణి జాతకం' ఎలా ఉంటుందో? - ఈ సమ్మర్‌కు చూసేద్దాం!, పొట్టచెక్కలయ్యేలా నవ్వేందుకు మీరు రెడీయేనా!





















