Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధానితో ఆయన సమావేశమయ్యే అవకాశాలుఉన్నాయి.

Telangana CM Revanth Reddy got PM appointment : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఆయనకు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. మంగళవారమే ఢిల్లీకి చేరుకుని బుధవారం ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే చట్టబద్ధమైన కులగణన చేశామని ఆమోదించి.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టాలని ఆయన ప్రధానమంత్రిని కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత మంది కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన పనులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీలో మోదీతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి
ముందుగా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. పార్టీ అంతర్గత విషయాలపై చర్చించే అవకాశం ఉంది. గత డిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ... పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీని కలిశారు. ఆ సమయంలో కులగణనపై ప్రత్యేకమైన సూచనలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇచ్చారని చెబుతున్నారు. అందుకే మళ్లీ రీ సర్వే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. గతంలో కులగణనలో పాలు పంచుకోని వారి కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
బీసీ రిజర్వేష్లు అమల్లోకి తెచ్చేలా ప్రయత్నాలు
అలాగే ఐదు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో.. నాలుగు సీట్ల వరకూ కాంగ్రెస్ కు లభిస్తాయి. అయితే ఆశావహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కుల సమీకరణాలు.. ఇతర సమీకరణాలు చూసుకుని ఓ జాబితాను హైకమాండ్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఓ మైనార్టీకి.. అలాగే ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్ కు అవకాశాలు ఇప్పించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
పార్టీ హైకమాండ్ సూచనల మేరకు స్థానిక ఎన్నికలు
బీసీలకు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వస్తే.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కావడం .. ఆసక్తి రేపుతోంది. సాధారణంగా బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ అరుదుగా లభిస్తుంది. మరో వైపు రాజకీయలబ్ది కోసం రిజర్వేషన్ల అంశం ఉపయోగించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడటానికే మోదీ అపాయింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

