Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
AP Assembly Budget Sessions | మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు, ఐదేళ్లు ఏం చేశారంటూ మండలిలో నారా లోకేష్ ప్రశ్నించారు.

Andhra Pradesh News | అమరావతి: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు.. అన్ని సీట్లు ఇచ్చి సీఎం చేస్తే ఎందుకు హోదా తేలేకపోయారని వైసీపీ సభ్యులను ఏపీ మంత్రి నారా లోకేష్ నిలదీశారు. అయిదేళ్లు కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతూ ఓటేయడాన్ని ప్రశ్నించారు. నష్టపోయిన ఏపీని గాడిన పెట్టేందుకు ఏపీలో టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పాం. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ఏపీకి రూ.13 వేల కోట్లు తీసుకొచ్చాం. దాంతోపాటు రాజధాని అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల గుండె చప్పుడు అయిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కాపాడుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్ సాధించామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు మీరు. మీరా దళితుల గురించి మాట్లాడేది?
అమరావతి: దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు ఎవరు, డోర్ డెలివరీలు చేసింది ఎవరో అందరికీ తెలుసునంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. దళితులపై దమనకాండ చేసి, వారి గురించి మీరా మాట్లాడేది? అంటూ నిప్పులు చెరిగారు. అనవసర రాద్ధాంతం చేయొద్దని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని వైసీపీ సభ్యులకు నారా లోకేష్ సూచించారు. గవర్నర్ స్పీచ్ నాలుగో పేజీ వివరాలు చదివి వినిపించేందుకు లోకేష్ ప్రయత్నించగా.. అడ్డుకునేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు. ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు, ఇంగ్లీషులో చెబితే ఎందుకు అల్లరి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 6.5 లక్షల పెట్టుబడులతో, 4 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ పేర్కొన్నారు.
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు.. ఏమైంది? టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయి. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పాం. అధికారంలోకి రాగానే రూ.13 వేల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చాం. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం.… pic.twitter.com/esbZPf17CE
— Telugu Desam Party (@JaiTDP) February 25, 2025
కూటమి సభ్యులు వర్సెస్ బొత్స సత్యనారాయణ
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శాసన మండలిలో కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీకి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని, ఆ పెట్టుబడులతో 4 లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయని ముందే ఎలా చెబుతారని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని ప్రభుత్వానికి బొత్స సూచించారు. అయితే గవర్నర్ స్పీచ్ కాపీ ఇవ్వాలని మండలి ఛైర్మన్ మోషేను రాజు కోరగా, మంత్రి అనిత వెళ్లి ఇచ్చారు. పరిశ్రమల ద్వారా పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పామని నారా లోకేష్ బదులిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

