అన్వేషించండి

Urvashi Rautela: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్?

NTR Neel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సౌంగ్ చేయనున్నట్లు టాక్.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కేజిఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిలిమ్స్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా (NTR Neel Movie) రూపొందుతోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టెప్స్ వేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత? ఆ కహాని ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

స్పెషల్ సాంగ్ ఉంటుంది... అయితే!?
దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. యష్ హీరోగా ఆయన తీసిన 'కేజిఎఫ్'లో హిందీ వెర్షన్ సాంగ్ మౌని రాయ్ చేయగా... దక్షిణాది భాషల్లో మిల్కీ బ్యూటీ తమన్నా చేశారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమాలో స్పెషల్ సాంగ్ అంటూ ఏదీ లేదు. ఆ కథలో స్పెషల్ సాంగ్‌కు స్కోప్ లేదు.‌ అయితే... ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి స్పెషల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. అయితే దాని గురించి ఇప్పుడే మాట్లాడడం చాలా ఎర్లీ అవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సాంగ్ ఉంటే ఊర్వశీ రౌతేలా చేయవచ్చు. లేదంటే మరొక అందాల భామ కూడా రావచ్చు. ఏదైనా జరగొచ్చు. 

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

హైదరాబాద్ సిటీలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే... హీరో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశారు. సెకండ్ షెడ్యూల్ కూడా ఎన్టీఆర్ ఉంటారా? లేదా? అనేది సందేహమే. ప్రస్తుతం దేవర జపనీస్ రిలీజ్ ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. జపాన్ దేశంలో మార్చి 28న దేవర విడుదల కానుంది. అందుకని, మార్చి 22వ తేదీన జపాన్ వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. మధ్యలో చేస్తే ఒక చిన్న షెడ్యూల్ చేయవచ్చు. అది సంగతి.

Also Read: సుమక్క వంటల షోలో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' ప్రేమజంట... పృథ్వీ శెట్టి - విష్ణుప్రియ జోడీ ఈజ్ బ్యాక్

తెలుగులో ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్టుగా ఊర్వశి!
ఊర్వశి రౌతేలాకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జస్ట్ స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా ఆడియన్స్ అందరికీ ఆవిడ దగ్గర అవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన 'డాకు మహారాజ్' సినిమాలో ఆవిడ చేసిన స్పెషల్ సాంగ్ 'దబిడి దిబిడి...' విమర్శలతో పాటు వైరల్ అయింది. ఇక ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరిగినప్పుడు స్టేడియంలో సందడి చేసింది ఊర్వశి. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్‌ను కలిసింది. దాంతో సుకుమార్ నెక్స్ట్ సినిమాలో ఆవిడ ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. సుకుమార్ సినిమాలలో ప్రత్యేక గీతాలు ఎంత సూపర్ హిట్ అవుతాయనేది చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని సుక్కుని తనకు ఒక్క సాంగ్ ఇవ్వమని ఊర్వశి రౌతేలా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఆ అవకాశాలను కొట్టి పారేయలేం.

Also Readసమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
అలహాబాద్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య, బర్త్‌డేకి నిమిషాల ముందు బిల్డింగ్ పైనుంచి దూకడంతో విషాదం
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Embed widget