కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా? ఇప్పుడిదే డౌట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్‌ని నిద్రపట్టకుండా చేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే రూమర్ రీసెంట్‌గా విపరీతంగా వినిపిస్తోంది. దీంతో కోహ్లీ ఆర్సీబీని వదిలేస్తున్నాడని.. అందుకే ఈ కాంట్రాక్ట్‌పై సంతకం చేయలేదని పుకార్లు మొదలయ్యాయి. ఇలాంటి టైంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీకి ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీ దక్కింది. ఈ ట్రోఫీ దక్కిన ఆనందంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ నెక్ట్స్ టోర్నీకి రెడీ అవుతున్న టైంలో.. కోహ్లీ ఆర్సీబీని వదిలేస్తున్నాడనే పిడుగులాంటి వార్త.. వాళ్లకి నిద్ర లేకుండా చేస్తోంది.
అలా టెన్షన్ పడిపోతున్న వాళ్లకి మహ్మద్ కైఫ్ లడ్డూ లాంటి న్యూస్ చెప్పాడు. కోహ్లీ తన మొదటి మ్యాచ్ ఆర్సీబీకే ఆడాడని, చివరి మ్యాచ్ కూడా ఆర్సీబీకే ఆడి రిటైర్మెంట్ ఇచ్చేస్తానని తనకి ప్రామిస్ చేశాడంటూ కైఫ్ చెప్పడంతో ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ ఇద్దరూ తెగ ఖుషీ అయిపోతున్నారు. 'విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాడనే మాట అబద్ధం. ఆర్‌సీబీతో కమర్షియల్ డీల్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే..? ఫ్రాంచైజీతో రెండు ఒప్పందాలు ఉంటాయి. ప్లేయర్‌గా.. కమర్షియల్‌గా ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్‌సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయకపోవడానికి ఓ కారణం ఉంది. ఆర్‌సీబీకి కొత్త యజమాని వచ్చే అవకాశం ఉంది. కొత్త ఓనర్ ఎంట్రీతో ఫ్రాంచైజీ డెసిషన్స్‌లో ఛేంజెస్ రావచ్చు.
ఒకవేళ యజమాని మారితే.. కొత్త చర్చలు జరుగుతాయి. ఇవన్నీ తెర వెనుక జరిగే విషయాలు. వీటిపై స్పష్టమైన సమాచారం ఎవరికీ ఉండదు. అందుకే కోహ్లీ వెయిట్ చేస్తున్నాడు. అంతేకానీ.. టీమ్‌ని మాత్రం వదిలిపెట్టడు.’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఇప్పుడే మళ్లీ పరుగుల వరద పారించడం స్టార్ట్ చేశాడు. 2025 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 650+ పరుగులు చేసి టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించాడు. దీంతో ఆర్‌సీబీ కూడా ఇప్పుడే టైటిళ్లను గెలవడం మొదలుపెట్టింది. ఇలాంటి క్రూషియల్ టైంలో కోహ్లీ టీమ్‌ని వదిలి వెళ్లే ఛాన్సే లేదన్నాడు కైఫ్.





















