Minister Narayana : అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
Minister Narayana : నెల్లూరు జిల్లా లీడర్ల కామెంట్స్‌పై మంత్రి నారాయణ సీరియస్ అయ్యారు. కూటమిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు.

Minister Narayana : ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలోని కొందరు నేతల ప్రకటనలు అధిష్ఠానాలను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వంలోని శాఖలపై చేస్తున్న కామెంట్స్ ఆందోళనకరంగా ఉంటున్నాయి. ఈ మధ్య నెల్లూరు సీనియర్ నేత కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని, మంత్రి పట్టించుకోవడం లేదంటూ హాట్ విమర్శలు చేశారు. దీనిపై ఆ జిల్లా మంత్రి నారాయణకు మంత్రి నాదెండ్ల ఫోన్ చేశారు. కూటమిలో తాము ఉన్నామా లేమా అని ప్రశ్నించారు. ఇదంతా మీరే చేయిస్తున్నారా అని అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా నేతలతో మంత్రి నారాయణ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్‌లో నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్‌గా మారుతోంది.
అసలు పార్టీ మీటింగ్‌లో నారాయణ ఏమన్నారంటే..." ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకుంటూ ఎన్డీఏ పార్టీలను ఇరకాటంలో పెడుతున్నారు. ఇది పార్టీ అధినేత సీరియస్‌గా ఉన్నారు. నేను అందరికీ ఒకటే చెప్తాను. దీని మీద నేను డిస్కస్ చేయను. ఎవరూ ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వద్దు. దీనిపై పార్టీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం లేకుండా మాట్లాడొద్దు. లేదా పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి. పార్టీ ఆఫీస్ నుంచి డేటా పంపించి మాట్లాడమంటే మాట్లాడండి. ఎవరికి వాళ్ళు ప్రిసైడ్ చేసి ఇవ్వద్దు."
ఇప్పుడు చాలా మందిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేశారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. వీటిపై కూడా ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు. గతంలో ఇలానే ప్రతి విషయంపై మాట్లాడిన వాళ్లు 11 సీట్లకు పరిమితం అయ్యారని గుర్తు చేశారు. మీరు కూడా ఇలా మాట్లాడితే మనం కూడా 11 సీట్లకు పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. "సీఎం చాలా క్లియర్‌గా కేబినెట్‌లో ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. చట్టం దాని పైన అది చేసుకుంటుంది. సొసైటీలో అరాచకం ఉండకూడదు. ప్రజా పరిపాలన స్మూత్‌గా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి. లేకుంటే వ్యాపారస్తులు రారు అని మాకందరికీ వెరీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అందుకే ఎవరిని అరెస్ట్ చేసినా మాట్లాడటంలేదు. అదే లాస్ట్ గవర్నమెంట్‌లో అరెస్ట్ చేస్తే ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ పెద్ద రచ్చ చేసేవాళ్ళు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఓహ్ అని స్పందించారు. సీఎం ఎమ్మెల్యేలకి, క్యాబినెట్ వాళ్ళందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎవ్వరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం పార్టీ ఆఫీస్ లేదా మేము చెప్తాం లేదంటే పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌కి ఇస్తారు." అని హెచ్చరించారు.
ఎన్డీఏ గవర్నమెంట్ మూడు పార్టీలు కలయికతో వచ్చిందని నారాయణ గుర్తు చేశారు. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుందో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారమే ఉదాహరణగా నారాయణ చెప్పుకొచ్చారు. "మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్న లోటుపాట్లు వస్తుంటాయి. నేను కాకినాడ ఇంచార్జి మంత్రిని పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ నేతతో వాళ్లకు ఘర్షణ జరుగుతుంది. నా పని ఏందంటే అక్కడ పరిస్థితులు చక్కదిద్దడమే. వర్మ చాలా దూకుడు ఉన్న వ్యక్తి. ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఆయన స్థానంలో పవన్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కూటమి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అతన్ని జీరో చేశాం. కలిసి ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటానికి లేదని చెప్పాం. పార్టీ మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడొద్దు అని చెప్పాం. ముఖ్యమంత్రి పిలిచి నా ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు. లేదంటే నువ్వు వారి మీటింగ్స్‌కు వెళ్లొద్దని చెప్పారు."
సూపర్ సిక్స్‌పై జరిగిన ఇంటింటి ప్రచారంలో కూడా తననే పిఠాపురం వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారని నారాయణ తెలిపారు. "ఇది ముఖ్యమంత్రి ఆలోచన, పార్టీ ఆలోచన. మూడు పార్టీలు కలయిక. ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి. నేను చూసుకుంటాను. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే నేను సహించను. నేను ఎలాంటి వ్యక్తినో అందరికీ తెలుసు. చాలా స్మూత్‌గా ఉంటా,అవసరమైతే చాలా రఫ్‌గా మారుతా. ఎవర్నీ లెక్క చేయను. ఈరోజు నన్ను పార్టీలో నిలదీసేలా చేశారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావ్ అని నన్ను ప్రశ్నించారు. నేను ఒకటే చెప్పా మంచిగా ఉండాలి అని కొంత ఫ్రీడం ఇచ్చాను. ఆ ఫ్రీడంని కొంత మిస్ యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవ్వటానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు?.అని ప్రశ్నించారు.
జనసేన నాయకులతో తరచూ సమావేశం జరుగుతున్నాయని వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. "వారానికి ఒక రోజు మనోహర్‌తో కూర్చుంటున్నాం. 15 రోజులకో 20రోజులకో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చిస్తున్నారు. చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు ఇంకొన్ని వివాదాలు ఉండొచ్చు. అలా కూర్చొని మాట్లాడుతూ పరిష్కరించుకుంటాం. కానీ ఈరోజు జనసేనలోని నెంబర్ టూ నిన్న ఫోన్ చేశారు. మేం ఎన్డీలో ఉన్నామా అని ప్రశ్నించారు. మీరేం చేయిస్తున్నారు నారాయణ గారు అని అడిగారు. నా డిపార్ట్మెంట్‌ని డీఫేమ్ చేస్తారా అని నిలదీశారు. మీ డిపార్ట్మెంట్‌పై నన్ను మాట్లాడమంటారా అని అడిగారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అంత అవసరం ఏం ఉంది."
"చాలా చక్కగా టౌన్ ఉంది. నెల్లూరు బ్రహ్మాండంగా ఉంది. నాలుగు కోట్ల రూపాయలు సీసీ కెమెరాలు సాంక్షన్ అయ్యాయి. వాటితో మరింతగా సిటీ సురక్షితం అవుతుంది. ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు విదేశాల్లో ఉండేవాళ్ళని పట్టుకొని పెట్టుబడులు తెస్తుంటే సీఎం వెరీ హ్యాపీ. కానీ జిల్లా రాజకీయాలకు వచ్చేసరికి మాటపడాల్సి వస్తోంది. ఎందుకు అలా చేసుకుంటున్నారు. నేను కూడా అరవగలను తిట్టగలను. దాని వల్ల ఉపయోగం లేదు. ప్రజలకి సేవ చేస్తే ఓట్లు వేస్తారు. తిట్టేవాళ్లను కాదు. నాకు పార్టీలో గౌరవం ఉంది. నారాయణ ఎవరి జోలికి పోడు ఆయన పని చేసుకుంటాడు పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాడు. పార్టీకి అన్ని విధాలా సపోర్ట్ ఉంటాడు. నెల్లూరు సభ గురించి కూడా సీఎం మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ జరుగుుతన్నది మాత్రం బాగాలేదు. మీరు ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. నేను ఐ విల్ క్యాప్చర్. ఒకరిపై ఒకరు తిట్టుకోవడంబాగాలేదు. అందరికీ చాలా లోపాలు ఉన్నాయి. వాటి సరిచేసకోవడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లడానిక ట్రై చేయండి. అని నేతలకు నారాయణ హితబోధ చేశారు.





















