Priyank Kharge vs Nara Lokesh on Google | పెట్టుబడులపై పెద్దయుద్ధం..వైజాగ్ vs బెంగుళూరు | ABP Desam
వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు రెండు నగరాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు ఇరుకుగా మారిపోయిందని పెట్టుబడులన్నీ ఆంధ్రాకు వెళ్తున్నాయని..గూగుల్ డేటాసెంటర్ ను వైజాగ్ లో ఏర్పాటు చేయటమే అందుకు ఉదాహరణ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఏపీపై అక్కసు వెళ్లగక్కారు ప్రియాంక్ ఖర్గే. అయితే ప్రియాంక్ ఖర్గే కామెంట్స్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడకపోయినా...ఏపీకి వస్తున్న పెట్టుబడులపై ఓ ట్వీట్ చేశారు లోకేశ్. ఆంధ్రా ఫుడ్ కి ఘాటు ఎక్కువ అని వాళ్లు చెబుతారని...అలాగే ఆంధ్రా కి వస్తున్న పెట్టుబడులకు కూడా ఘాటు ఎక్కువ అన్నారు లోకేశ్. అంతటితో ఆగలేదు..ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి పొరుగు రాష్ట్రానికి ఆల్రెడీ మంటెక్కి సెగ తగులుతున్నట్లు ఉంది అంటూ గట్టిగానే పంచ్ ఇచ్చారు లోకేశ్.





















