(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi Warangal Meeting: మీరు వరంగల్ వైపు వెళ్తున్నారా, అయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన సందర్భంగా నేడు పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ గమనించి ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Rahul Gandhi Warangal Meeting: ఏఐసీసీ కీలక నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రానికి రానున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి హెలికాఫ్టర్‌లో వరంగల్ వెళ్తారు. అక్కడి ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభ సందర్భంగా వరంగల్ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions for Rahuls Farmar Rally And Rythu Sangharshana Sabha) విధించారు.
రాహుల్ వరంగల్ సభ, పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు..
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పెద్దపెండ్యాల ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఉనికిచెర్ల, వడ్డేపల్లి చర్చ్, ఎన్జీవోస్ కాలనీ మీదుగా చేరుకోవాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రాహుల్ గాంధీ పాల్గొనే రైతు సంఘర్షణ బహిరంగ సభకు హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు ఫాతిమా (మదర్ థెరిస్సా) జంక్షన్ వద్ద ప్రజలను దించి, తిరిగి మడికొండ వైపుగా ఈనాడు ఆఫీసు ఎదురుగావున్న పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు ప్రాంతాల నుంచి బహిరంగ సభకు వచ్చే వాహనాలు నాయుడు పెట్రోల్ పంప్, ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు మీదుగా నీలిమ జంక్షన్ (విష్ణుప్రియ గార్డెన్స్) వద్ద నేతలు, కార్యకర్తలు, ప్రజలను దించి.. ప్రకాశ్ రెడ్డిపేట పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకోవాలి. అక్కడ పార్కింగ్ పూర్తయితే WIMS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
ములుగు, భూపాలపల్లి ప్రాంతాల నుండి సభకు వచ్చే వాహనాల ప్రజలను కాళోజీ సెంటర్లో దించి హయగ్రీవాచారి కాంపౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. అక్కడ పార్కింగ్ పూర్తయితే ములుగురోడ్డు వద్ద ఎల్బీ కాలేజి ఆవరణలో వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
కరీంనగర్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు కాళోజీ సెంటర్లో ప్రజలను దించి KUC SVS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలి.
వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అంబేద్కర్ జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లి చర్చ్ మీదుగా మదర్ థెరిస్సా జంక్షన్ వైపు ప్రయాణించి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. లేదా కరీంనగర్ రోడ్, కెయుసి, చింతగట్టు వద్ద ఔటరింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి హన్మకొండ కాళోజీ జంక్షన్ నుండి కాజీపేట వైపునకు ఎలాంటి భారీ వాహనాలకు అనుమతి లేదు. కనుక ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Kavitha on Rahul Gandhi: రాహుల్ పర్యటన వేళ కవిత వ్యంగ్యాస్త్రాలు! ఆ టైంలో ఏం చేశారంటూ నిలదీత