అన్వేషించండి

Rahul Gandhi Telangana Tour: నేడు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ - షెడ్యూల్‌లో కనిపించని 2 కీలక విషయాలు

Rahul Gandhi Telangana Tour: నేటి నుంచి రెండు రోజులపాటు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఇప్పటికే వరంగల్ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. నేటి నుంచి రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ పర్యటించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాహుల్ పర్యటన, వరంగల్ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన ముందుగా అనుకున్నట్లుగా ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం, చంచల్ గూడ జైలులో ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు, యూత్ లీడర్స్‌ను పరామర్శించే కార్యక్రమాలు రాహుల్ గాంధీ తాజా పర్యటన షెడ్యూల్‌లో పేర్కొనలేదు. 

నేటి సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. 
ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం 4:50కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. 5:10కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన నేరుగా వరంగల్ బయలుదేరుతారు. వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకున్నాక సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ (Congress MP Rahul Gandhi to address public meet in Warangal)లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. సభ పూర్తయ్యాక తిరిగి వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి  10:40కు హైదరాబాద్ చేరుకుంటారు రాహుల్ గాంధీ. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో ఆయన స్టే చేయనున్నారు. 

తెలంగాణలో రెండో రోజు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు రాహుల్ నివాళులు అర్పిస్తారు. అనంతరం సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ గాంధీ భవన్‌కు చేరుకుంటారు.

గాంధీ భవన్‌లో పార్టీ special extended మీటింగ్‌లో మధ్యాహ్నం 2:45 వరకు పాల్గొంటారు. ఆ తరువాత మెంబర్ షిప్ కో ఆర్డినేటర్లతో ఫొటో సెషన్ లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఏయిర్ పోర్ట్ చేరుకుంటారు. శనివారం సాయంత్రం 5:50కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లిపోతారు.   

రాహుల్ కీలకమని భావించిన ఓయూలో సమావేశంతో పాటు మరికొన్ని కార్యక్రమాలను టీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఆయన రానుండటం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విద్యార్థులను సైతం కలుసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకుందని ఆ పార్టీ కీలక నేతలు వ్యాఖ్యానించారు.

Also Read: Rahul Gandhi Tour Shedule : తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే ! 

Also Read: Bandi Sanjay : బండి సంజయ్ కనబడటం లేదు, సిరిసిల్ల టీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget