By: ABP Desam | Updated at : 05 May 2022 11:52 PM (IST)
రాహుల్ తెలంగాణ టూర్ షెడ్యూల్
తెలంగాణలో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ ఖరారయింది. శుక్రవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి హెలికాఫ్టర్‌లో వరంగల్ వెళ్తారు. నైట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తాజ్ కృష్ణా హోటల్లో బస చేస్తారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఇది ..
సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఏయిర్ పోర్ట్ చేరుకోనున్న రాహుల్ గాంధీ..
5:10కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు..
5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు..
6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు..
ముందుగా ఒక స్టేజిపైన ఏర్పాటు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తారు..
8 గంటలకు వరంగల్ నుండి బై రోడ్ ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు..
రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు..
7వ తేదీ షెడ్యూల్
మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు..
12:50-1:10 మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు..
1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు..
1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ special extended మీటింగ్ లో పాల్గొంటారు.
2:45 నుంచి 2:50 వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేటర్లతో ఫోటో సెషన్ లో పాల్గొంటారు.
3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏయిర్ పోర్ట్ చేరుకుంటారు..
5:50కి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తారు.
కాంగ్రెస్ నేతలు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ... ఓయూలో సమావేశం పెడతామని చెప్పారు. అలాగే... అరెస్టయిన ఎన్‌ఎస్‌యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శిస్తారని కూడా చెప్పారు. అయితే ఈ రెండు కార్యక్రమాలూ షెడ్యూల్‌లో కనిపించలేదు. రాహుల్ గాంధీ పర్యటనను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ నేతలు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా కమిటీలు నియమించారు. మరోవైపు హైదరాబాద్ పర్యటనలోనూ షెడ్యూల్‌లో లేకపోయినా కీలకమైన కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా విభేదాలు వీడి విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు
Breaking News Live Updates: కేబినెట్ నుంచి పంజాబ్ ఆరోగ్య మంత్రికి ఉద్వాసన
Hyderabad: వంట మాస్టర్తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎలక్షన్
Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్లో మోదీతో బైడెన్
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో