Gold Smuggling: బ్యాటరీలలో 2.9 కోట్ల బంగారం.. అలా చేశారు.. ఇలా దొరికిపోయారు
శంషాబాద్ రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 2.9 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి తీసుకువస్తున్నట్టు గుర్తించారు.
శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ. 2.96 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి రీఛార్జింగ్ బ్యాటరీ (లాంతర్)ల చాటులో అక్రమంగా బంగారం తీసుకొస్తున్నారు ఇద్దరు ప్రయాణికులు. అయితే వారిని భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్‌లో స్వదేశానికి వచ్చారు. 6.06 కిలోల బంగారాన్ని కరిగించి రీఛార్జింగ్ బ్యాటరీల లోపల అమర్చి పై నుంచి సామగ్రి పెట్టుకొని తరలిస్తున్నారు.
అయితే ఆ ప్రయాణికుల ప్రవర్తనపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వారినే పరిశీలిస్తుండగా అనుమానస్పదంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తనికి చేయగా.. అక్రమ బంగారం తరలింపు బయటపడింది. రూ.2.96 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఎవరున్నరన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇటీవలే..
ఇటీవలే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్లంతా.. లో దుస్తుల్లో అక్రమంగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేశారు. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన వేముల శ్రీనివాస్, అమర్‌గొండ శ్రీనివాస్‌ల నుంచి రూ.12.31 లక్షలు విలువైన 256 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. కువైట్ ప్రయాణికుడి నుంచి 763.66గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ
Also Read: ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి