By: ABP Desam | Updated at : 19 Oct 2021 10:20 PM (IST)
టీడీపీ అధినేత చంద్రబాబు(ఫైల్ ఫొటో)
టీడీపీ ఆఫీసులపై దాడులు దారుణమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ దాడులు పక్కా ప్లాన్ అన్నారు. పోలీసులు, సీఎం జగన్ తెలిసే దాడులు జరిగాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రమేయంతోనే టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగాయన్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే టీడీపీ ఆఫీసు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ప్రణాళిక ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడులకు తెగపడ్డారని ఆరోపించారు. ఈ దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమని చంద్రబాబు అన్నారు. ఈ దాడులకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్నామన్నారు. అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజల పన్నులతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 356 అధికరణం పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు.
గవర్నర్ కు ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వరుసగా జరిగిన దాడులు జరగడం, పోలీసులు ఎవరూ అడ్డుకోకపోవడం, సాక్షాత్తూ డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యధేచ్చగా రౌడీ మూకలు విధ్వంసం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని.. ఇళ్లల్లో, కార్యాలయాల్లో విధ్వంసానికి దిగుతున్నారని వివరించారు. రక్షణ కోసం కేంద్ర బలగాల్ని పంపాలని కోరారు. ఆ తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా చంద్రబాబు ఫోన్ చేశారు. దాడుల పరిస్థితుల్ని వివరించారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఏపీ పోలీసులతో మాట్లాడతామని వారు హామీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు, పట్టాభి ఇళ్లపై జరిగిన దాడి దృశ్యాలు భీతావాహంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద పది కార్లలో వచ్చిన దుండగులు గేటును విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లి దాడులు చేస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఓ అరగంట సేపు విధ్వంసం సృష్టి.. పలువుర్ని గాయపర్చి వారు వెళ్లిపోయారు. అప్పటి వరకూ పోలీసులు ఎవరూ రాలేదు.
Also Read : కాకినాడలో టీడీపీ నేతలపై ఎమ్మెల్యే అనుచరుల దాడి, ఉద్రిక్తత
దాడి విషయం తెలిసిన తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విధ్వంసాన్ని చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దాడులకు గురైన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ పద్దతి ప్రకారం.. వ్యవస్థీకృతంగా దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట చంద్రబాబు ఇంటిపైకి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా ఇలా పెద్ద ఎత్తున కార్లలో వెళ్లారు. అయితే గేటు దగ్గర వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. అదే సమయంలో టీడీపీ నేతలు ప్రతిఘటించడంతో ఆగిపోయారు. లేకపోతే అదే తరహాలో చంద్రబాబు ఇంటిపైనా దాడి జరిగి ఉండేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఆఫీసు .. డీజీపీ కార్యాలయం పక్కన ఉన్నా దాడులు చేయడం అంటే ఏపీలో శాంతిభద్రతలు లేవని అర్థం అని అంటున్నారు.
BJP On Dharmavaram: ధర్మవరం దాడి ఘటనపై బీజేపీ సీరియస్- కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మళ్లీ ఏపీనే నెంబర్ 1
Dharmavaram News : ప్రజాస్వామ్యమా, పాలేగాళ్ల రాజ్యమా?, ఎమ్మెల్యే కేతిరెడ్డిపై గోనుగుంట్ల ఫైర్
Amanchi Highcourt : సీబీఐ అరెస్ట్ భయం - హైకోర్టులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్ !
PSLV C53 Launch : నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శాటిలైట్ ప్రయోగానికి అమ్మవారి దీవెనలు
Kishan Invites TDP : అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !
TS SSC Results District Wise: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఈ జిల్లా టాప్! అట్టడుగున హైదరాబాద్ - ఉత్తీర్ణత శాతం ఎంతంటే
Eatala Jamuna: కేసీఆర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం - ఈటల జమున సవాలు
Pavitra Lokesh: పోలీసులకు కంప్లైంట్ చేసిన పవిత్రా లోకేష్