China Smart Phones : చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇక.. ఇండియాలో అమ్ముతున్న ఫోన్లలోని ప్రి ఇన్‌స్టాల్ యాప్స్ సహా.. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉటుంది.
చైనా స్మార్ట్ ఫోన్ల పై పూర్తి స్థాయి నిఘా ఉంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లపై పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే ఆ ఫోన్ల తయారీకి ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో ప్రతి చిన్న సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ అలాంటి సమాచారం ఇవ్వడానికి చైనా కంపెనీలు అలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. దీనికి సంబంధించిన నోటీసులను కేంద్ర ప్రభుత్వం చైనీస్ ఫోన్ల కంపెనీలకు పంపింది. వివో, ఒప్పో, షావోమీ, వన్‌ఫ్లస్ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చింది.
Also Read : యూపీలో ఘోరం.. జిల్లా కోర్టులో లాయర్ దారుణహత్య.. రోహిణి షూటౌట్ మరువకముందే..!
ఇక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ స్మార్ట్ ఫోన్లు అమ్మినా చైనా కంపెనీలు సమాచారాన్ని దాచి పెడుతున్నాయి. ఇదే అంశంపై చైనాపై అనేకానేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ మాత్రం ఉపేక్షించకూడదని భారత్ నిర్ణయించుకుంది. భారత ప్రజల భద్రత, డేటా సెక్యూరిటీ వంటి కారణాల వల్ల ఫోన్లలో ఉండే ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ ..ఇతర సాఫ్ట్‌వేర్ల వివరాలను మొత్తం తెలియచేయాలి. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
Also Read : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?
చైనా కంపెనీలు అమ్ముతున్న ఫోన్లు భారత వినియోగదారులకు సురక్షితమైనవో కావో తేల్చాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆ కంపెనీలకు తేల్చి చెప్పింది. భారత్‌లో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో అత్యధికం చైనా కంపెనీలవే. సగానికన్నా ఎక్కువ మార్కెట్‌ను చైనా కంపెనీలు కైవసం చేసుకున్నాయి. అయితే చైనా కంపెనీలు అనేక కుట్రలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తల కారణంగా టిక్ టాక్ సహా అనేక కీలకమైన యాప్‌లను కేంద్రం గత ఏడాది నిషేదించింది. యాప్‌ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి మేడిన్ ఇండియా అంటూచైనా కంపెనీలు ప్లాంట్లు పెట్టాయి. కానీ ముడి సరుకు మొత్తం చైనా నుచే వ్తోంది. అందుకే ఇప్పుడు ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణకు ఆస్కారం ఉన్నందున స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ నియంత్రణకు సిద్ధపడింది.
Also Read : నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అన్యాయం జరిగింది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు