Rahul Vs Priyanka : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?
ప్రియాంక శక్తి, సామర్థ్యాలను చూసి రాహుల్ భయపడుతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పీకే కొత్త చిచ్చు పెడుతున్నారని అంటున్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు నాయకత్వ సంక్షోభంలో ఉంది. రాహుల్ గాంధీ క్యాడర్‌కు నమ్మకం కలిగించలేకపోతున్నారు. ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ది బెస్ట్ అన్న పద్దతిలో ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఆయన ఇమేజ్‌పై వేసిన మరక కావొచ్చు.. అధికారం పోగొట్టుకున్న తర్వాత బాధ్యతలు చేపట్టడం కావొచ్చు ఏదైనా కానీ ఆయన ఇదీ తన నాయకత్వ విజయం అనేలా ఒక్కటీ చూపించలేకపోయారు. అందుకే తరచూ ప్రత్యామ్నాయ నాయకత్వ ప్రస్తావన కాంగ్రెస్‌లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరింత పెంచారు. ప్రియాంకా గాంధీని ఎదగకుండా రాహులే అడ్డుకుంటున్నారన్నట్లుగా ఆయన ప్రకటన చేసేశారు. ఇప్పుడీ అంశం కాంగ్రెస్‌లో కొత్త చిచ్చుకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాహుల్ కన్నా ప్రియాంకనే గొప్ప నేతగా "పీకే" సర్టిఫికెట్ !
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం పని చేస్తారా.. లేక కాంగ్రెస్‌లో చేరుతారా అన్నదానిపై ఇప్పటికి క్లారిటీ లేదు. కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఓ ఇంటర్యూలో ఆయన రాహుల్ గాంధీ .. ప్రియాంకా గాంధీని నియంత్రిస్తున్నారని తేల్చేశారు. 2017లో జరిగిన యూపీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. దానికి కారణం ప్రియాంక ఎక్కడ ఎదిగిపోతుందోనని రాహుల్ గాంధీ ఆందోళన చెందడమేనేట. ఈ విషయాన్నీ పీకే నేరుగానే చెబుతున్నారు ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలా ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని చెబుతున్నారు. ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాలను చూసి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ భయపడుతున్నారని తేల్చేశారు.
ప్రియాంకను యూపీకే ఎందుకు పరిమితం చేస్తున్నారు ?
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. రాహుల్ బదులు ప్రియాంకకు పగ్గాలివ్వాలని కాంగ్రెస్‌లో ఓ అంతర్గత డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఈ క్రమంలో పీకే వ్యాఖ్యలు హైలెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ పనులు చక్క బెడుతున్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ప్రియాంకను కాంగ్రెస్ పార్టీలో మరింత చురుగ్గా.. ఇంకా చెప్పాలంటే ఆమెను జాతీయ స్థాయి నేతగా ప్రొజెక్ట్ చేయాలన్న డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆమెను పెద్దగా హోప్స్ లేని ఉత్తరప్రదేశ్ కే పరిమితం చేయకుండా.. జాతీయ నేతగా తెర ముందుకు తీసుకు రావాలని కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది.
Also Read : యూపీ ఎన్నికల్లో 'ప్రియాంకం'.. 'భాజపా X కాంగ్రెస్' గా మారిన రాజకీయం
రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని కొన్నాళ్లుగా క్యాడర్ విన్నపాలు !
రాహుల్ గాంధీ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు సిద్దంగా లేరు. పార్టీలో సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తితో గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎవరు ఎన్ని సార్లు చెప్పినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. చివరికి సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి బండి నడిపిస్తున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కూడా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ప్రకటించే నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో సోనియా గాంధీనే తాను తాత్కాలికం కాదని స్పష్టం చేయాల్సి వచ్చింది.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి
ఖాళీగా అధ్యక్ష పదవి.. "పీకే" ప్రియాంకను రేస్‌లోకి తెస్తున్నారా ?
అయితే.. 90శాతం మంతి కాంగ్రెస్ క్యాడర్‌తో పాటు అన్ని స్థాయిల నేతల్లోనూ రాహుల్‌కు సానుకూలత ఉంది. ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించాలనే డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. నిజానికి అనారోగ్యం వల్ల సోనియా పార్టీ కి అధ్యక్షురాలిగా ఉన్నా.. అత్యంత క్లిష్టమైన విషయాల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిగతా అన్నీ రాహులే చూసుకుంటున్నారు. ఓ రకంగా వర్కింగ్ ప్రెసిడెండ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ అధికారికంగా బాధ్యతలు తీసుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించారు. అంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆమె పేరును రేసుకోకి తెస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు.
Also Read : సోనియా గాంధీకి సిద్ధూ లేఖాస్త్రం.. ఇదే చివరి అవకాశమని వ్యాఖ్య
ప్రియాంకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయాలని డిమాండ్ పెరిగే చాన్స్ !
రాహుల్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంకా గాంధీ అయితే సరిపోతారని ఆ పార్టీ వర్గాలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నాయి. సీడబ్ల్యూసీ ఆమోదిస్తే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే గాంధీ కుటుంబం ఏకాభిప్రాయానికి వస్తేనే అది సాధ్యం. అలా అయితేనే ప్రియాంక బాధ్యతలు తీసుకుంటారు. నిజానికి ప్రియాంకకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. సోదరుడికి తోడుగానే తాను రాజకీయ సాయం చేస్తున్నానని పలుమార్లు ప్రకటించారు. అయితే ఇటీవల పార్టీ పదవి తీసుకున్నారు. యూపీ ఎన్నికల బాధ్యతలు తీసుకుటున్నారు. దీంతో ఆమెకు చాన్సివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీన్ని ప్రశాంత్ కిషోర్ మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నారు.
Also Read : నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అన్యాయం జరిగింది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు