By: ABP Desam | Updated at : 19 Oct 2021 08:18 PM (IST)
ప్రజలు ఆవేశపడవద్దని డీజీపీ పిలుపు
రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయనం పాటించాలని డీజీపీ కార్యాలయం పిలుపునిచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని.. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని కోరారు.
టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలు వచ్చి దాడి చేశారని డీజీపీ కార్యాలయం చెబుతోది. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. పదుల సంఖ్యలో కార్లలో కర్రలు, రాడ్లతో దుండగులు వచ్చి దాడులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అంత సేపు దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని టీడీపీ అధినేతచంద్రబాబు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధానంగా పోలీసులపైనే ఆరోపణలు చేస్తున్నారు. శాంతిభద్రతలను వదిలేసి రాజకీయ పార్టీ కోసం పని చేస్తున్నారని.. రాష్ట్రంలో అరాచకాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంలోనే విధ్వంసం జరిగిందంటే నేరగాళ్లకు ఎలా భయం లేకుండా పోయిందో తెలుస్తుందని అంటున్నారు.
Watch: విమర్శలు చేస్తే దాడులు చేస్తారా.. ప్రభుత్వంపై అచ్చెన్న సీరియస్
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ, సీఎం కుమ్మక్కయి దాడులు చేయిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నేరుగా టీడీపీ ఆఫీసు మీద దాడి చేసినా పోలీసులు నింపాదిగా స్పందించడం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగానే దాడి చేశారని చెప్పడంపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం
GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్, రష్మిక
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా