News
News
వీడియోలు ఆటలు
X

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

రాముడి బాల్యం,వనవాసం, రామరావణ సంగ్రామం ఒకెత్తైతే రామరాజ్య పాలన మరోఎత్తు. మన పాలకులు పలు సందర్భాల్లో రామరాజ్యం అనే మాట వాడుతుంటారు. ఇంతకీ రామరాజ్యం ఎలా ఉండేదో తెలుసా..

FOLLOW US: 
Share:

Sri Rama Pattabhishekam 2023: రామరాజ్యం.... పాలకులు, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో ఈ పద వినిపిస్తుంటుంది. రామరాజ్యం తీసుకొస్తాం అని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తారు. ఇప్పటి వరకూ ప్రకటనలకే పరిమితమైన రామరాజ్యం అసలు ఎలా ఉండేదో తెలుసా..! రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఏం జరిగిందంటే...

వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యలో అడుగుపెట్టిన రాముడికి సాదరంగా స్వాగతం పలికాడు తమ్ముడు భరతుడు. శిరస్సు వంచి అంజలి ఘటించి  రాముడితో " మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరములు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు తండ్రి మాట నిలబెట్టేందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నేను తిరిగి రమ్మని అడిగితే నీ పాదుకలని ఇచ్చి రాజ్య పాలన చేయమన్నావు...నాకు నువ్వు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలాగే తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను అన్నాడు. భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. ఇంతలో అక్కడకు వచ్చిన శత్రుఘ్నుడు " అన్నయ్యా ! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది. అందుకని క్షుర కర్మ చేయించుకో " అన్నాడు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే... తండ్రి ఆజ్ఞాపించకపోయినా నాయందున్న ప్రేమతో స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనములో పెట్టి పదునాలుగు సంవత్సరాలు రాజ్యంపై మమకారం లేకుండా పాలించిన భరతుడు దీక్ష విరమిస్తే కానీ నేను విరమించను అన్నాడు.

Also Read: ఇది 9 సార్లు వరుసగా 9 రోజులు భక్తితో పారాయణం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయి

ఆనందోత్సాహాల్లో అయోధ్య
భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానాలు చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. అందమైన పట్టువస్త్రాలు ధరించి దివ్యాభరణాలు వేసుకుని బయటకు వచ్చాడు. కోడలికి అభ్యంగన స్నానం చేయించి పట్టుచీర కట్టి అలంకరించి చూసుకుని మురిసిపోయింది కౌసల్యా దేవి. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు. ఆ రథం పగ్గాలు భరతుడు పట్టుకుని నడిపించాడు. ఓ వైపు శత్రుఘ్నుడు మరోవైపు  విభీషణుడు వింజామరలు విసురుతున్నారు.అయోధ్య మొత్తం రంగురంగుల రంగవల్లులతో నిండిపోయింది..అన్ని ఇళ్లపైనా పతాకాలు వేశారు..సంతోషంలో నాట్యాలు చేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలలో అయోధ్య మారుమోగిపోయింది. 

శ్రీరామ పట్టాభిషేకం
వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు సహా ఋషులందరూ పట్టాభిషేకానికి ముందురోజే అయోధ్య చేరుకున్నారు. రాముడి పట్టాభిషేకానికి నాలుగు సముద్ర జలాలు, ఐదువందల నదుల జలాలను వానరులు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు. వానరములు తీసుకొచ్చిన ఆ జలం రాముడికి అభిషేకించి పట్టాభిషేకం చేశారు. అంతరం కిరీటాన్ని తీసుకొచ్చి అలంకరించారు.  ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.

యువరాజుగా భరతుడు
యువరాజుగా పట్టాభిషిక్తుడికి అవు లక్ష్మణా అని రాముడు అంటే...నాకన్నా పెద్దవాడు భరతుడు తనకే ఆ అర్హత ఉందన్నాడు లక్ష్మణుడు. 
యువరాజ పట్టాభిషేకము భరతుడికి జరిగింది. సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు సహా వానర వీరులంతా బహుమతులు ఇచ్చారు. ఆ సమయంలో సీతమ్మ తన మెడలో ఉన్న హారం తీసి చేత్తో పట్టుకుంది. అది గమనించిన రామయ్య.. ఆ హారం ఎవరికి ఇస్తావో తెలుసా... పౌరుషం, బుద్ధి, విక్రమం, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవరిలో ఉన్నాయో వారికి ఈ హారం కానుకగా ఇవ్వు... అన్నిటికీ మించి ఆ వ్యక్తి నీ ఐదో తనానికి కారణం అయినవాడై ఉండాలి అని చెప్పాడు. వెంటనే సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది... కళ్లకు అద్దుకుని మెడలో వేసుకున్నాడు హనుమ. 

Also Read: 2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

రామరాజ్యం ఇలా ఉండేది
శ్రీరామచంద్రుడు సింహాసనం అధిష్టించిన రోజు నుంచీ రాముడు అనే మాట తప్ప ఆ రాజ్యంలో మరో పేరు వినిపించలేదు. రామరాజ్యంలో దొంగల భయం లేదు. అందరూ ఆరోగ్యవంతులుగా ఎలాంటి రోగాలు లేకుండా సుఖంగా జీవించేవారు. ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై వుండేవాళ్లు. ఎలాంటి విరోధాలు లేకుండా అనురాగంగా నివసించే వాతావరణం ఉండేది. వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రజలు రాగ, ద్వేషాలకు అతీతంగా తమ వృత్తుల్లో రాణించేవారు. రామచంద్రునితో సహా అందరూ సత్యాన్ని పలికేవాళ్లు. అసత్యాలు, దుర్వార్త ప్రచారం, పుకార్లకు ఆ నాటి సమాజంలో విలువ లేదు. ధర్మ ప్రవర్తనతో అకాల మరణాలు ఉండేవి కావు. మనిషి ప్రశాంతంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో అందుకు అవసరమైన పరిస్థితులు రాముడు పాలించిన రాజ్యంలోనే ఉన్నాయి అందుకనే ఆయన పాలించిన రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. పాలకులు ప్రజలకు ఏం చెబుతారో ముందుగా ఆచరించి చూపాలి. అప్పుడే ప్రజానీకానికి మార్గదర్శిగా ఉంటారు. రామరాజ్యంలో పాలకుడు ధర్మ తప్పలేదు..ప్రజలు కూడా అదే పద్ధతిని అనుసరించారు.  నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు. రాముడి పరిపాలన అంటే అంతా శుభమే..

Published at : 31 Mar 2023 06:00 AM (IST) Tags: lord rama Sri Rama Navami 2023 Sri Rama Pattabhishekam 2023 Importance of Rama Rajyam

సంబంధిత కథనాలు

Mysterious Bijli Mahadev  : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Mysterious Bijli Mahadev : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Tulsi Planting In Home: ఈ తులసి మొక్కను ఇంట్లో నాటితే అన్నీ శుభాలే..!

Tulsi Planting In Home: ఈ తులసి మొక్కను ఇంట్లో నాటితే అన్నీ శుభాలే..!

Sitting on the Steps of a Temple: ద‌ర్శ‌నం అనంత‌రం గుడి మెట్లపై కూర్చోవ‌డం వెనుక‌ రహస్యం మీకు తెలుసా?

Sitting on the Steps of a Temple: ద‌ర్శ‌నం అనంత‌రం గుడి మెట్లపై కూర్చోవ‌డం వెనుక‌ రహస్యం మీకు తెలుసా?

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?