2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!
April Horoscope 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
మేషరాశివారికి ఏప్రిల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. గురుబలం బావున్నప్పటికీ ఏడో ఇంట్లో రాహు-కేతువుల కలయిక వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థికపరంగా నెల ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ద్వితీయార్థం కొంత ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి.
వృషభ రాశి
వృషభ రాశివారికి ఈ నెల గ్రహాలు లాభం, వ్యయంలో రెండింటిలో సంచరిస్తున్నందున మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు. భార్య భర్త మధ్య వివాదాలు జరగొచ్చు..
మిథున రాశి
మిథున రాశి వారికి ఏప్రిల్ లో గ్రహసంచారం బావుంటుంది..ఫలితంగా అన్ని రంగాల వారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. తొమ్మిదో స్థానంలో శని సంచారం ఆర్థికంగా ఓ మెట్టు ఎక్కిస్తుంది. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. ధైర్యంగా దూసకుపోతారు. జన్మంలో కుజుడి సంచారం వల్ల కొన్ని విషయాల్లో ఉద్రేకంగా ఉంటారు. రాహువు సంచారం కూడా మీకు శుభఫలితాలనిస్తుంది.
Also Read: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి కూడా ఏప్రిల్ నెల అనుకూలంగా ఉంది. వృత్తి , వ్యాపారం, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ ఆధిక్యత కొనసాగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. బృహస్పతి సంచారం వల్ల ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది. సూర్యుడు, బుధుడి శుభ సంచారం వల్ల తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు.ఖర్చులు పెరుగుతాయి. 12వ ఇంట కుజుడి సంచారం వల్ల కొన్ని అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది...
సింహ రాశి
సింహ రాశివారికి ఈ నెలలో గ్రహసంచారం బాగానే ఉంది. అన్ని రంగాలవారు రాణిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయానికి లోటుండదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి.భార్య భర్త మధ్య అవగాహన బావుంటుంది. ఖర్చులు తగ్గించండి. కొన్ని విషయాల్లో నిందలు పడాల్సి ఉంటుంది.
కన్యా రాశి
ఏప్రిల్ నెల కన్యారాశివారికి అంత అనుకూలంగా లేదు..అష్టమంలో గ్రహసంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. అనుకున్న పనిలో అడ్డంకులు తప్పవు. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. వాహన మార్పులు, గృహ మార్పులు ఉంటాయి. శత్రువుల సంఖ్య పెరుగుతుంది అప్రమత్తంగా ఉండండి.
తులా రాశి
తులా రాశివారికి కూడా ఈ నెలలో గ్రహసంచారం అనుకూలంగా ఉండదు. చేయు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు. ధైర్యం కోల్పోతారు. చెడువార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలు కొంతవరకూ ముందుకుసాగుతాయి.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
వృశ్చిక రాశి
ఏప్రిల్ నెల వృశ్చికరాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. 8 వ స్థానంలో కుజుడి సంచారం వల్ల గృహం మారే అవకాశం ఉంది
ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి ఈ నెల ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మూడో ఇంట ఉన్న శని వల్ల మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకర రాశి
మకర రాశివారికి ఏప్రిల్లో గ్రహసంచారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు..ఆరోగ్యం బావుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
ఉద్యోగులు తమ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
కుంభ రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఏప్రిల్లో పూర్తవుతాయి. వ్యాపారానికి సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. లోలోపల భయాందోళనలు ఉంటాయి. శత్రువులు ఉత్సాహంగా ఉంటారు జాగ్రత్త.
మీన రాశి
మీన రాశివారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మిత్రుల సహకారంలో కొన్ని పనులు పూర్తవుతాయి. కోపం తగ్గించుకోవాలి, మాట అదుపులో ఉంచుకోవాలి.