AP Medical Colleges Issue: ఇవే జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు - వైసీపీని వీడియోలతో ఇరకాటంలో పెట్టిన టీడీపీ
Medical Colleges Politics: ఏపీలో జగన్ కట్టించారని చెబుతున్న మెడికల్ కాలేజీల వీడియోలను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చాలా కాలేజీలు పునాదుల దశలు దాటలేదు.

TDP posts videos on social media of medical colleges: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం వివాదాస్పదమవుతోంది. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేశారు. జగన్ కూడా.. తాము సృష్టించిన సంపదను అమ్మేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల్లో సీట్లు సామాన్యులకు లభించబోవన్నారు. తాము పదిహేడు వరకూ కాలేజీలను కట్టించామని వైసీపీ నేతలు ప్రకటించారు.
ఈ ఆరోపణలపై టీడీపీ మండిపడింది. జగన్మోహన్ రెడ్డి కట్టిన మెజికల్ కాలేజీలు ఇవేనంటూ పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. బిల్డింగులు ఎక్కడ అయ్యా అని అడిగితే, ఫేక్ సాక్షిలో VFX గ్రాఫిక్స్ చూపిస్తారు.. ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తారు. జగన్ మాయా ప్రపంచంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల కధల్లో, ఈ "బాపట్ల మెడికల్ కాలేజీ" మరో మాయ.. జగన్ చేసే ఫేక్ రాజకీయం ఇదిగో ఇలాగే ఉంటుందిని వీడియోను పోస్టు చేశారు.
ఇదే జగన్ కట్టానని చెప్తున్న "బాపట్ల మెడికల్ కాలేజీ"..
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
బిల్డింగులు ఎక్కడ అయ్యా అని అడిగితే, ఫేక్ సాక్షిలో VFX గ్రాఫిక్స్ చూపిస్తారు.. ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తారు.
జగన్ మాయా ప్రపంచంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల కధల్లో, ఈ "బాపట్ల మెడికల్ కాలేజీ" మరో మాయ..
జగన్ చేసే ఫేక్ రాజకీయం… pic.twitter.com/3XYidZ05Z9
అమలాపురం మెడికల్ కాలేజీ కూడా పునాదులను దాటలేదు.
నేను కట్టేసా.. నేను ప్రారంభించేసా అని ఊహల్లో విహరిస్తూ, జగన్ కట్టేసిన "అమలాపురం మెడికల్ కాలేజీ" ఇదే..
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
ఇక్కడ కాలేజీ ఎక్కడ ఉందో, హాస్పిటల్ ఎక్కడ ఉందో, జగన్ ఒక్కడికే తెలుసు..
ఇలా ప్రజలని మభ్య పెట్టి ఫేక్ రాజకీయం చేస్తే, ప్రజలు చూస్తూ ఉంటారా ?#JaganFakedMedicalColleges… pic.twitter.com/FMDeCmkFQD
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుకొండలో మెడికల్ కాలేజీ పునాదులు కూడా దాటలేదు.
నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేసాను అని చెప్పుకుంటున్న జగన్, కట్టేసిన "పెనుకొండ మెడికల్ కాలేజీ" ఇది..
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
ఈ పిల్లర్ల మీద కూర్చుని మెడిసిన్ చదవాలా ? లేక ఆ రాడ్ల మీద పడుకుని వైద్యం తీసుకోవాలా ? @ysjagan #JaganFakedMedicalColleges#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/a013IaW34B
ఆదోని మెడికల్ కాలేజీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. అక్కడ బోర్డు కూడా పాడుబడిపోయింది.
జగన్ రెడ్డి ఊహా ప్రపంచంలో కట్టేసానని చెప్తున్న 17 మెడికల్ కాలేజీల్లో మరొకటి "ఆదోని మెడికల్ కాలేజీ".
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
తాడేపల్లి ప్యాలెస్ లో స్పెషల్ గా తయారు చేసిన డ్రీం మెషీన్ ఎక్కితేనే, ఇక్కడ "ఆదోని మెడికల్ కాలేజీ/హాస్పిటల్" కనిపిస్తాయి...
రూ.410.32 కోట్లతో పూర్తి చేయాల్సిన ఈ మెడికల్ కాలేజీ కోసం,… pic.twitter.com/lfTGYsHF19
మదనపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణాలను కూడా టీడీపీ బయట పెట్టింది.
తన ఊహా ప్రపంచంలో, జగన్ తాను కట్టేసానని చెప్తున్న 17 మెడికల్ కాలేజీల్లో, కట్టిన మదనపల్లె మెడికల్ కాలేజీ ఇదే..
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
సొట్టబడిన నేం బోర్డు, భూమి మట్టంలో పోసిన కూసింత కాంక్రీట్ తప్ప అక్కడ ఏమీ లేదు..
జగన్ ఊహా ప్రపంచంలో మాత్రం అక్కడ కాలేజీ ఉంది, స్టూడెంట్స్ చదువుతున్నారు, డాక్టర్లు ఉన్నారు,… pic.twitter.com/xfjzPZf0kS
దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయని.. తాము కట్టేశామని ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఆరోపణలకు వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంది.





















