LIK Release Postponed : ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ ఫాంటసీ 'LIK' రిలీజ్ వాయిదా - ఇట్స్ అఫీషియల్... అసలు రీజన్ ఏంటంటే?
LIK Release Date : ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Pradeep Ranganathan LIK Release Date Postponed : కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్‌గా 'డ్యూడ్' సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా 'LIK' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మూవీ రిలీజ్ వాయిదా పడింది.
అసలు రీజన్ ఏంటంటే?
నిజానికి ఈ నెల 18న మూవీ రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేసింది. అయితే, అనుకోని కారణాలతో మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త తేదీ వెల్లడిస్తామని చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌లో కొంత నిరాశ నెలకొంది. ఈ మూవీలో ప్రదీప్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు.
Also Read : పూనకంతో ఊగిపోయిన మహిళ - బాలయ్యకు చేతులెత్తి మొక్కిన చిన్నారి... 'అఖండ 2' థియేటర్ సిత్రాలు
లవ్‌కు ఇన్సూరెన్స్
లైఫ్‌కు ఇన్సూరెన్స్ అందరం విన్నాం కానీ లవ్‌కు కూడా ఇన్సూరెన్స్ ఉండే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలిపారు మేకర్స్. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌గా... తన లవ్ కోసం మొబైల్ గ్యాడ్జెట్ ఉపయోగించుకుని 2035 వరకూ టైమ్ ట్రావెల్ చేసే ఓ వ్యక్తి రోల్‌లో ప్రదీప్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై మూవీని నిర్మించారు. అటు గతంలో ఈ చిత్ర బృందానికి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నోటీసులు పంపించింది. తమ టైటిల్ ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లే ఛాన్స్ ఉందని వెల్లడించింది. పేరు మార్చాలంటూ నోటీసుల్లో పేర్కొంది.





















