(Source: ECI/ABP News/ABP Majha)
Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
శ్రీరాామనవమి 2023: మార్చి 30 గురువారం శ్రీరామనవమి.. ఈ సందర్భంగా శ్రీరాముడి ఒక్క శ్లోకం చదివితే విష్ణుసహస్రనామం పఠించినంత ఫలితం వస్తుందని చెబుతారు.. ఏంటా శ్లోకం..అలా చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటి
Sri Rama Navami 2023: శ్రీరామ నవమి సందర్భంగా విష్ణుసహస్రనామంతో సమానమైన శ్లోకం గురించి వివరణ
శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.!!
ఈ ఒక్క శ్లోకం ఎందుకంత పవర్ ఫుల్...శ్లోకం మొత్తం రామ నామమే కదా ఉంది..అలాంటప్పుడు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందని ఎందుకు చెబుతున్నారు అంటారా..ఈ విషయం స్వయంగా పరమేశ్వరుడు పార్వతి అమ్మవారితో చెప్పాడు.
‘ర’కారము రుద్రుని
‘అ’కారము బ్రహ్మను
‘మ’కారము విష్ణువుని సూచిస్తుంది
అందుకే ‘రామ’శబ్దం బ్రహ్మవిష్ణు, శివాత్మక రూపంగా భావిస్తారు.
‘రామ’అనే శబ్దం జీవాత్మ పరమాత్మలకు స్వరూపంగా కూడా చెబుతారు
‘రా’అనే అక్షరాన్ని ‘తత్’అని అనగా ‘పరబ్రహ్మము’
‘మ’ అనే అక్షరానికి ‘త్వం’ అనగా జీవాత్మ అని అర్థం
Also Read: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
అష్టాక్షరి మహామంత్రమయిన ఓం నమో నారాయణాయ నమఃలో ‘రా’ బీజాక్షరం
పంచాక్షరి మహామంత్రమయిన ఓం నమఃశివాయలో ‘మ’ బీజాక్షరం
ఈ రెండు మంత్రాల శక్తిని రామ నామం కలిగి ఉందని పురాణాలు చెబుతున్నాయి
అత్యంత శక్తివంతమైన రామ మంత్రం జపంవల్ల ముక్తిమోక్షాలు లభిస్తాయి. అందుకే హరిహరాత్మకమైన ఈ ‘రామ’నామ మంత్ర రాజాన్ని తారక మంత్రంగా చెబుతారు.
భవబంధాల నుంచి తరింపచేయడంవల్లనే ‘రామ’మంత్రాన్ని తారక మంత్రమని పిలుస్తారు
‘రామ’ నామ శబ్దం ప్రాణాయామ శక్తిగా కూడా చెబుతారు.
స్వభావ సిద్ధంగా పూరకమైన శ్వాసను ‘మ’కారంతో కుంభించి, ‘రా’కార ఉచ్ఛారణతో రేచకం చేయడం వల్ల ప్రాణాయామం సంపూర్ణంగా జరుగుతుంది. ఆ కారణంగా ‘రామ’ నామ శబ్ద ఉచ్ఛరణంవల్ల ఒక పక్క రామనామ సంకీర్తనా ఫలం, మరో పక్క ప్రాణాయామం జరిగి, ఆరోగ్యం చేకూరుతుందని శాస్తక్రోవిదులు చెబుతున్నారు. అందుకే రామ నామాన్ని ఏకాగ్రతతో ఐదు నిముషాలు ఉచ్ఛరిస్తే, మనస్సు నిర్మలమై, ఏకాగ్రత సిద్ధిస్తుందని, సత్‌కార్యాలకు పునాది పడుతుందని వివరిస్తారు.
Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
త్రిమూర్త్యాత్మక రూపమైన ‘రామ’నామాన్ని నిత్యం పఠించి ఆంజనేయుడంతటి పరమభక్తుడు దైవమయ్యాడు. రామనామ స్మరణే పరమావధిగా భావించిన ఆ స్వామి జగద్విఖ్యాతినొందాడు.
రామనామమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా భావించి కబీరు, భక్తరామదాసులాంటి మహాభక్తులు స్వామి కృపకు పాత్రులై, జగద్విఖ్యాతి నొందారు.
రామ నామంలోని విశిష్టతను మహత్తును తెలిసిన పరమేశ్వరుడు ఆ మంత్రాన్ని జపించమని సాక్షాత్తు పార్వతి మాతకు చెప్పాడు
‘రామ’శబ్దంలోని రెండు అక్షరాలు మనో నిగ్రతను పెంచి, ఏకాగ్రతను వృద్ధిచేసి ఆధ్యాత్మిక ద్వారాలను తెరుస్తాయి. దుష్కర్మలన్నీ పటాపంచలై, మనోనిబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా మానసికానందం సొంతమవుతుంది. శివకేశవులకు భేదం లేదని తెలిపే ఈ నామ స్మరణంవల్ల సర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయి. సర్వమనోకామనలు సిద్ధించి, భవిష్యత్తు నందన వనమవుతుంది. ఆధ్యాత్మిక చింతనాసక్తి ఉన్న భక్తులంతా ఈ నామాన్ని జపించడంవల్ల ఆధ్యాత్మికాసక్తి పెరిగి, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అంత శక్తివంతమైన శ్లోకం మరోసారి చదువుకోండి....
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!