Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Game Changer Third Single: శంకర్ స్టైల్ సాంగ్ చూడటానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ రెడీనా!? 'గేమ్ చేంజర్' సినిమాలో మూడో పాట ఎప్పుడు విడుదల చేసేదీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.
Game Changer Third Single Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా సినిమా 'గేమ్ చేంజర్' నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఇప్పుడు మూడో పాటను విడుదల చేయడానికి యూనిట్ రెడీ అయింది. ఆ పాట ఎప్పుడు విడుదలకు కానందో తెలుసా?
నవంబర్ 28న 'గేమ్ చేంజర్' మూడో పాట!
'గేమ్ చేంజర్' సినిమా నుంచి 'జరగండి జరగండి...' పాటను మొదట విడుదల చేశారు. నిజం చెప్పాలంటే... సాంగ్ రిలీజ్ కంటే ముందు సోషల్ మీడియాలో, నెట్టింట లీక్ అయ్యింది. ఆ తర్వాత ఒరిజినల్ వెర్షన్ విడుదల చేయక తప్పలేదు. మొదట నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కొంత వచ్చినా... ఆ తర్వాత వైరల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'రా మచ్చా...' విడుదల చేశారు. నవంబర్ 28న మూడో పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Love shall take a purple cover, this November! 💜#GameChangerThirdSingle on Nov 28th! 😊💜#GamechangerOnJAN10 🚁
— Sri Venkateswara Creations (@SVC_official) November 24, 2024
GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth @Naveenc212 @AntonyLRuben @DOP_Tirru @artkolla… pic.twitter.com/YwpMs6WCod
రామ్ చరణ్, కియారా అద్వానీలపై మూడో పాట తీశారు. దీని కోసం 15 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు సమాచారం. న్యూజిలాండ్ దేశంలోనే అందమైన లొకేషన్లలో బాస్కో సీజర్ నృత్య దర్శకత్వంలో ఈ పాటను తీసినట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
డిసెంబర్ 21న అమెరికాలో గ్రాండ్ ఈవెంట్!
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో భారీ ఎత్తున 'గేమ్ చేంజర్' విడుదల చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నారు. అంత కంటే ముందు అమెరికాలో కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
డిసెంబర్ 21న అమెరికాలో రాజేష్ కల్లెపల్లి నేతృత్వంలో ఈవెంట్ జరగనుంది. ఇటీవల ఉప్పెన ఫేమ్ సానా బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' చిత్రీకరణ మైసూరులో ప్రారంభం అయ్యింది. సోమవారం నుంచి చరణ్ సైతం షూటింగులో పాల్గొంటారని తెలిసింది. సుమారు మూడు వారాల పాటు ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందని ఆ తరువాత కొంత విరామం ఇచ్చి గేమ్ చేంజర్ ప్రచార కార్యక్రమాలలో రామ్ చరణ్ పాల్గొంటారని తెలిసింది.
శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ చేంజర్' చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జి స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ నిర్మాతలు. తమిళంలో ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి ఆదిత్య రామ మూవీస్, హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడానీ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాపై ఉన్న భారీ అంచనాలు చేస్తే మొదటి రోజు రికార్డు వసూల్లో రావడం కాయంగా కనబడుతోంది.