Rakasa Teaser : ఊరికి ఉన్న శాపం వెనుక రహస్యం ఏంటి? - నవ్విస్తూనే భయపెట్టేశారు... ఇంట్రెస్టింగ్‌గా రాకాస టీజర్
Rakasa Teaser Review : టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ లేటెస్ట్ హారర్ కామెడీ 'రాకాస' టీజర్ వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నవ్వులు పూయించడం సహా భయపెడుతుందని ఈ వీడియోను బట్టి తెలుస్తోంది.

Sangeeth Sobhan's Rakasa Teaser Out : 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' మూవీస్ ఫేం సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'రాకాస'. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్, టీజర్ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ చేసిన మరో టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇప్పటివరకూ తన కామెడీతో నవ్వులు పూయించిన సంగీత్ శోభన్ ఈ మూవీలో నవ్వించడంతో పాటు కాస్త భయపెట్టనున్నారు. కామెడీతో పాటే సెటైరికల్ టర్న్ ఇస్తూ ఇంట్రెస్టింగ్‌గా సాగిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పూయిస్తోంది. 'నరకం నుంచి సందేశం వస్తుంది', 'ఇక సమయం లేదు', 'మన ఊరి శాపం ఇది' అనే డైలాగ్స్‌తో ప్రారంభమైన టీజర్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో హైప్ క్రియేట్ చేసింది.
అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు ఆ ఊరిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది. అసలు ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి?, ఊరి బంగ్లాలో చిక్కుకున్న హీరో దాని రహస్యాన్ని ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలతో ఎంతో ఆసక్తికరంగా టీజర్ కట్ చేశారు.
'కమిటీ కుర్రోళ్లు' మూవీతో డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి ఫస్ట్ చిత్రంతోనే జాతీయ స్థాయిలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందిన నిహారిక కొణిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కామెడీ ప్రధాన బలం కాగా దాంతో పాటే ఓ కొత్త పాయింట్‌ను చూపించనున్నట్లు గ్లింప్స్, ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read : విజయ్ రష్మిక పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ - రణబాలి దర్శకుడు ఏం చెప్పారంటే?
మూవీలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, జబర్దస్త్ ఫేం రోహిణి, 90s సిరీస్ ఫేం రోహన్ కీలకపాత్రలు పోషించారు.
Uninvited. Unfriendly. Completely out of control. 🛑🚩
— Pink Elephant Pictures (@PinkElephant_P) March 1, 2026
Welcome to the world of #RĀKĀSĀ where absolutely nothing behaves. 🤣
The #RaaKaaSaa Teaser is officially OUT NOW! Dive into the chaos ⬇️#RākāsāTeaser
🔗 https://t.co/5qnY7HGRDq pic.twitter.com/XtFngbu5Sz
'రాకాస' టెక్నికల్ టీం - బ్యానర్స్ : జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిర్మాతలు : నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : మానస శర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మన్యం రమేష్, ఆడిషన్ స్క్రీన్ ప్లే : మహేష్ ఉప్పాల, సంగీతం : అనుదీప్ దేవ్, సినిమాటోగ్రఫీ : రాజు ఎదురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ : విజయ్, ఎడిటర్ : అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్ : రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ : పుల్ల విష్ణు వర్ధన్, కాస్ట్యూమ్ డిజైనర్ : సంధ్య సబ్బవరపు, పి.ఆర్.ఒ : ఎస్.కె.నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఈవెంట్ పార్ట్‌నర్ : యు వుయ్ మీడియా, మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























