అన్వేషించండి

Vijay Deverakonda Rashmika : విజయ్ రష్మిక పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ - రణబాలి దర్శకుడు ఏం చెప్పారంటే?

Ranabaali First Look : విరోష్ కపుల్ వెడ్డింగ్ సర్ప్రైజ్‌గా 'రణబాలి' నుంచి ఇద్దరి పోస్టర్‌తో పాటు పెళ్లి పాట కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ట్రెండ్ అవుతుండగా డైరెక్టర్ రాహుల్ ఎమోషనల్ స్టోరీ షేర్ చేశారు.

Rahul Sankrityan Reveal Story About Vijay Deverakonda Rashmika Mandanna Wedding Poster : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వెడ్డింగ్ గిఫ్ట్‌గా శనివారం 'రణబాలి' నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీ సందర్భంగా విజయ్, రష్మిక పెళ్లి సందర్భంగా వచ్చిన పాటను సైతం విడుదల చేయగా ట్రెండ్ అవుతోంది.

మూవీలో రణబాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక మందన్న నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మూడో మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక పోస్టర్ విషయానికొస్తే... విజయ్ గంభీరంగా, భార్య జయమ్మ అమాయకంగా ఓ పాత తరం దంపతుల్లా ఉన్న లుక్ అదిరిపోయింది. ఈ జంట చూడ ముచ్చటగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.

పోస్టర్ వెనుక ఎమోషనల్ స్టోరీ

తాజాగా ఈ పోస్టర్ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీని 'రణబాలి' డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ షేర్ చేశారు. ఇది కేవలం పోస్టర్ మాత్రమే కాదని... ఎన్నో ఎమోషన్స్ దాగి ఉన్నాయని అన్నారు. 'నాకు పాత కాలం నాటి ఫోటోలంటే చాలా ఇష్టం. మా పేరెంట్స్, తాత మామ్మలు కెమెరా ముందు నిలబడి ఎలాంటి ఫోజులు ఇవ్వలేదు. రిహార్సల్స్ చేసి చిరునవ్వులు లేవు. అప్పట్లో కేవలం రియాలిటీ మాత్రమే ఉండేది. రణబాలి ప్రపంచాన్ని నిర్మిస్తున్నప్పుడు నేను అదే నిజాయతీని కోరుకున్నా.

1800ల చివరి కాలం నాటి నేపథ్యంలో రణబాలి ఉండనుంది. అప్పటి గాంభీర్యం, అమాయకత్వం, మట్టి, మనుగడ లోతుగా పాతుకుపోయాయి. అప్పటి వివాహ సంప్రదాయం కళ్లకు కట్టేలా ఈ పోస్టర్ డిజైన్ చేశాం. విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చిన రోజు వారు నటులుగా కనిపించలేదు. ఆ పూర్వ కాలానికి చెందిన వారుగా కనిపించారు. ఎలాంటి స్టైలిష్ ఫోజులు లేకుండా కేవలం సాధారణ వ్యక్తుల్లాగా  వారిని కెమెరాల్లో బంధించాం. వాళ్లు ఆ క్షణంలో ఎలా ఒదిగిపోయారో అనేది నన్ను కదిలించింది.' అంటూ రాసుకొచ్చారు.

ఈ పోస్టర్ రిలీజ్ చేసే నాటికి వారు రియల్‌గా భార్యాభర్తలు కావడం ఆశ్చర్యంగా అనిపించిందని అన్నారు రాహుల్. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయని తెలిపారు. ఈ ఫోటో చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపించిందని చెప్పారు. కొన్ని బంధాలు శాశ్వతమైనవి అంటూ రాసుకొచ్చారు. తన ఫ్యామిలీ పాత ఫోటోలను షేర్ చేశారు.

Also Read : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?

ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా... విజయ్, రష్మికలతో పాటు ఆర్నాల్డ్ వోస్లో బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1854 - 1878 మధ్య కాలంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
Gaddar Awards 2025 : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget