First Kiss Scene In Indian Cinema: ఇండియన్ సినిమాల్లో తొలి లిప్ లాక్ - ఆ హీరోయిన్ మన విశాఖ అమ్మాయే అని తెలుసా?
First Lip lock in Indian Silver Screen: ఇండియన్ సినిమాల్లో తొలి లిప్ లాక్ ఏ సినిమాలో ఉందో తెలుసా? ఆ ముద్దు పెట్టింది మన విశాఖ అమ్మాయే అని తెలుసా? భారతీయ సినీ చరిత్రలో మొదటి ముద్దు గురించి తెలుసుకోండి.
ఇప్పుడంటే మన సినిమాల్లో లిప్ లాక్ లు చాలా మామూలు అయిపోయాయి. మా సినిమాలో ఇన్ని లిప్ లాక్ లు ఉన్నాయి అంటూ పబ్లిసిటీ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 -20 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. తెరపై లిప్ లాక్ అంటే చాలా అసభ్యం అనే స్థితి లో సెన్సార్ బోర్డు ఉండేది. అయితే ఇండియాలో లిప్ లాక్ సీన్ల ట్రెండ్ ఈ మధ్య మొదలైంది కాదు. 1933లోనే ఇండియన్ తెరపై తొలి లిప్ లాక్ సీన్ తీశారు. ఆ సీన్‌లో యాక్ట్ చేసిన హీరోయిన్ మన విశాఖ అమ్మాయి అని మీకు తెలుసా?
రీల్ కాదు... రియల్ లైఫ్‌లోనూ...
1933లోనే తొలి లిప్ లాక్ సీన్!
ఇండియన్ సినిమాలపై మొదటి నుంచి హాలీవుడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ సినిమాలు తీయడం మొదలైంది. సహజంగానే ఇంగ్లీష్ సినిమాల శైలి భారతీయ సినిమాలపై కూడా పడింది. ఆ టైంలో వచ్చిందే 'కర్మ' (1933) సినిమా. దీనికి దర్శకత్వం వహించింది జేఎల్.ఎఫ్. హంట్. హీరో హీరోయిన్లు హిమాన్షు రాయ్, దేవికా రాణిల మధ్య క్లైమాక్స్ ముందు ఈ లిప్ లాక్ ఉంటుంది. అంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు తీసిన ఒకటి రెండు ఇండియన్ బేస్డ్ సినిమాల్లో చిన్నచిన్న లిప్ లాక్స్ వంటివి ఉన్నా.... ప్రాపర్‌గా తీసిన పెదవి ముద్దు సన్నివేశం 'కర్మ'లోనిదే. తర్వాత కాలంలో నాలుగున్నర నిమిషాల లిప్ లాక్ అంటూ ప్రచారం జరిగింది. అయితే... 'కర్మ'లో లిప్ లాక్ సీన్ రెండున్నర నిమిషాల పాటు ఉంటుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.
'కర్మ' సినిమాలో లిప్ లాక్‌పై పెద్ద కాంట్రవర్సీ వస్తుందనుకున్నా... అది జరగలేదు. అందుకు కారణం ఆ సీన్‌లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లు ఇద్దరూ నిజ జీవితంలో కూడా భార్యాభర్తలు కావడమే. సరిగ్గా ఈ సినిమా షూట్‌కు ముందు హిమాన్షు రాయ్, దేవికా రాణి పెళ్లి చేసుకున్నారు. ఆ సీన్ చేసింది భార్యాభర్తలే కదా అని విమర్శకులు లైట్ తీసుకున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఈ ముద్దు సీన్ సంచలనం సృష్టించింది. కానీ ఇండియన్ సినీ చరిత్రలో తొలి పెదవి ముద్దు సన్నివేశంగా దేవికా రాణి లిప్ లాక్ నిలిచిపోయింది.
దేవికా రాణి... మన విశాఖ అమ్మాయే
ఇండియన్ తెరపై తొలి లిప్ లాక్‌లో నటించిన దేవికా రాణి మన విశాఖలోనే జన్మించింది (1908లో). ఆమెది విశాఖపట్టణంలో స్థిరపడిన బెంగాలీ మూలాలు ఉన్న కుటుంబం. ఆర్థికంగా, విద్యా పరంగా బాగా ఉన్నత కుటుంబం కూడా. చిన్న వయసులోనే చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన దేవికా రాణి... చదువు పూర్తయిన తర్వాత హిమాన్షును కలుసుకుంది. మొదటి నుండి కళలపై ఇంట్రెస్ట్ ఉండటంతో... హిమాన్షు రాయ్ నిర్మించిన 'A throw of Dice' (1928) సినిమాకు కాస్ట్యూమ్స్, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసింది. అప్పుడే హిమాన్షుతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
Also Read: హీరోలను మోసం చేసిన హీరోయిన్లు... గుండెల మీద గట్టిగా కొట్టేశారండీ, మర్చిపోలేం!
'కర్మ'లో రియల్ లైఫ్ కపుల్ నటనకు ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాను ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ తీశారు. ముఖ్యంగా దేవికా రాణి నటనకు ఇంగ్లాండ్, ఇండియా... రెండు దేశాల్లోనూ మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఒక పాటను ఆమె రెండు భాషల్లోనూ పాడింది. భర్త మరణం (1940లో) మరణం తర్వాత దేవికా రాణి సినిమాలు తగ్గించేశారు. పదేళ్ల పాటు కథానాయికగా కెరీర్ కొనసాగించిన ఆమె చివరి చిత్రం 'హమారీ బాత్' (1943). ఈ సినిమాలో రాజ్ కపూర్ చిన్న పాత్రలో నటించడం విశేషం. తర్వాత కాలంలో ఆయన బాలీవుడ్ టాప్ స్టార్ అయ్యారు.
రాయ్ మరణించిన ఐదేళ్ల తర్వాత... 1945లో రష్యాకు చెందిన రోరిక్‌ను పెళ్లి చేసుకుని బెంగళూరు శివార్లలో 450 ఎకరాల ఎస్టేట్ కొనుక్కొని అక్కడే దేవికా రాణి స్థిరపడ్డారు. రోరిక్ చనిపోయిన ఏడాది తర్వాత 1994లో ఆమె మరణించారు. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి ఎస్టేట్‌ను కర్ణాటక ప్రభుత్వం సొంతం చేసుకుంది. 'ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా'గా సినీ చరిత్రలో నిలిచిపోయిన దేవికా రాణి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న (1969) మొట్టమొదటి గ్రహీత కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
Also Read: 1000 Crore Movies: బాహుబలిని బీట్ చేసేదెవరు? 1000 కోట్లు క్లబ్బు దాటి వెళ్ళేదెవరు?