Alternatives to Ghibli Style: జీబ్లీ స్టైల్ చిత్రాలను మర్చిపోండి - దాని తాతలాంటి స్టన్నింగ్ స్టైల్స్ మరో 10 ఉన్నాయ్
Creating Ghibli-style AI images: ChatGPT 4o ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌తో యూజర్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రత్యేకమైన విజువల్స్‌ను సృష్టించడానికి ప్రాంప్ట్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.

Alternatives to Ghibli-style AI images: OpenAIకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్ ChatGPT, కొన్ని రోజుల క్రితం, 4o ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి, నిజ జీవిత ఫొటోలను 'స్టూడియో జీబ్లీ స్టైల్' (Studio Ghibli style)గా మార్చడంలో ఇంటర్నెట్ ప్రపంచం బిజీ అయింది & ఇప్పటికీ బిజీగానే ఉంది. ప్రజలు ఈ ట్రెండ్ నుంచి బయటపడడానికి ఇంకొంత కాలం పట్టొచ్చు. అయితే, స్టూడియో జీబ్లీ స్టైల్ కంటే చాలా అద్భుతమైన & ఫన్నీగా అనిపించే స్టైల్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా?.
నిజ జీవిత చిత్రాలను కామిక్ రూపాల్లోకి మార్చగల కొన్ని ఆర్ట్ స్టైల్స్ గురించి ChatGPTని అడిగితే, ఆ ఫ్లాట్‌ఫామ్ ఓ లిస్ట్ తయారు చేసి అందించింది. ఆయా స్టైల్స్‌లోకి ట్రాన్స్‌ఫామ్ అయిన ఫొటోలు స్టన్నింగ్‌గా కనిపిస్తున్నాయి. మీరు AI జనరేటెడ్ ఇమేజ్‌లను ఇష్టపడితే, ప్రత్యేకమైన విజువల్స్‌ను సృష్టించే విభిన్న స్టైల్స్ మీకు తెలిసి ఉండాలి. వాటితో క్రియేట్ చేసిన ఇమేజ్‌లతో మీ కుటుంబ సభ్యులను, కొలీగ్స్‌ను, స్నేహితులను ఆశ్చర్యపరచవచ్చు.
జీబ్లీ స్టైల్‌ను మించిన 10 స్టన్నింగ్ స్టైల్స్
1. సైబర్‌పంక్ నియాన్ (Cyberpunk Neon) - హైటెక్ & గ్రిటీ డిస్టోపియన్ వైబ్‌ల మిశ్రమం అయిన నియాన్ లైట్స్‌తో మెరుస్తున్న ఇమేజ్‌లు క్రియేట్ చేయవచ్చు.
2. బరోక్ ఆయిల్ పెయింటింగ్ (Baroque Oil Painting) - యూరోపియన్ మాస్టర్స్ పెయింటింగ్స్ ప్రేరణతో రూపొందించిన ఈ శైలిలో గొప్ప నాటకీయత కనిపిస్తుంది.
3. పిక్సెల్ ఆర్ట్ (Pixel Art) - రెట్రో గేమింగ్ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. పిక్సలేటెడ్ ఇమేజ్‌లు నాస్టాల్జిక్ అయినప్పటికీ ఆధునికంగానూ కనిపిస్తాయి.
4. పిక్సర్ ఆర్ట్ (Pixar Art) - పేరు తగ్గట్లుగా గుండ్రని & మృదువైన చిత్రాలను ఇది జనరేట్ చేస్తుంది. మీరు దీనిని ఖచ్చితంగా ట్రై చేయాలి.
5. కార్టూన్ స్టైల్ (Cartoon Style) - లూనీ ట్యూన్స్ వంటి ఫ్లాట్ 2D నుంచి అడ్వెంచర్ టైమ్ వంటి మోడర్న్ యానిమేషన్‌ల వరకు విస్తృత రేంజ్‌లో స్టైలింగ్‌ను ఇది ఉపయోగిస్తుంది.
6. గోతిక్ నోయిర్ (Gothic Noir) - డార్క్, మూడీ లైటింగ్, షాడో ఎలిమెంట్స్ ఈ శైలిలో కనిపిస్తాయి & మిస్టీరియస్, డ్రామాటిక్ చిత్రాలను పరిపూర్ణంగా చూపిస్తాయి.
7. క్యారికేచర్ ఆర్ట్ (Caricature Art) - ఇది ముఖ కవళికలను హాస్యపూరితంగా మారుస్తుంది. హై కాంట్రాస్ట్, బోల్డ్ లైన్లను ఈ స్టైల్ ఉపయోగిస్తుంది.
8. సర్రియలిస్ట్ అబ్‌స్ట్రాక్షన్ (Surrealist Abstraction) – డాలీ, మాగ్రిట్టే వంటి కళాకారుల స్ఫూర్తితో రూపొందించిన స్టైల్ ఇది. కలలాంటి, ఆలోచింపజేసే చిత్రాలతో వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.
9. మాంగా అండ్ అనిమే (Manga and Anime) – జపనీస్ కళలోని శక్తిని, భావోద్వేగాలను ఈ శైలి సంగ్రహిస్తుంది. దాదాపుగా జీబ్లీ స్టైల్‌లా ఉంటుంది.
10. ఇంప్రెషనిస్ట్ బ్రష్‌వర్క్ (Impressionist Brushwork) – లూజ్‌గా కనిపించే, ఎక్స్‌ప్రెసివ్ స్ట్రోక్స్ మీ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. మోనెట్, రెనోయిర్ కళాఖండాల ఆకర్షణను ప్రతిఫలిస్తాయి.
ఈ ఆర్ట్ స్టైల్స్‌తో చిత్రాలను సృష్టించాలి?
ఈ స్టైల్స్ సృష్టించడానికి సరైన ప్రాంప్టింగ్ ఇవ్వాలి, అంటే సరైన పదాలతో కమాండ్ ఇవ్వాలి. మీరు ఊహించిన రూపాన్ని సరైన పదాలతో వివరించాలి. రంగులు, కూర్పు వంటివి ప్రస్తావించాలి. AI ఫ్లాట్‌ఫామ్ మిగిలిన పనిని జాగ్రత్తగా పూర్తి చేస్తుంది, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే చిత్రాన్ని మీ కళ్ల ముందుకు తీసుకొస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

