అన్వేషించండి

Coolie and War 2 clash : తలైవాతో తారక్ బాక్స్ ఆఫీస్ వార్... ఎఫెక్ట్ ఏ సినిమాపై పడబోతోంది ? 'వార్ 2' పై వచ్చిన రూమర్స్‌లో నిజమెంత ?

Coolie and War 2 clash : తలైవా మోస్ట్ అవైటింగ్ మూవీ 'కూలీ', తారక్ - హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్ 2' సినిమాలు రెండూ ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. మరి ఈ వార్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ?

War 2 Versus Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కూలీ' రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీని 'కూలీ' మేకర్స్ తారక్ సినిమాకు పోటీగా బాక్స్ ఆఫీసు బరిలోకి దింపబోతుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న 'వార్ 2' మూవీని ఇదే డేట్‌కు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నట్టు ముందుగానే అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు 'కూలీ' మూవీ 'వార్ 2'తో క్లాష్‌కి కాలు దువ్వడం వల్ల నష్టం ఎవరికి ? అనే చర్చ జోరుగా నడుస్తోంది. 

'వార్ 2' రూమర్స్ నిజమేనా ? 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'కూలీ'. ఈ మూవీ గురించి రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'కూలీ' విడుదల కానుంది. 'కూలీ'లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, ప్రముఖ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రెబా మోనికా జాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

అయితే 'కూలీ' మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నాము అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో 'వార్ 2'పై వచ్చిన రూమర్స్ నిజమేనా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. హృతిక్‌ రోషన్‌ - ఎన్టీఆర్‌ కాంబోలో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వార్ -2'. ఆగస్టు 14న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అంటూ వచ్చిన రూమర్స్ కు 'ఆరోజు అల్లకల్లోలమే' అనే రిప్లై తో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ ఇప్పుడు ఏకంగా తలైవా అదే డేట్ కు రంగంలోకి దిగడంతో 'వార్ 2' మూవీ నిజంగానే పోస్ట్ పోన్ కానుందా ? అనే డౌట్స్ మొదలయ్యాయి. 

ఈ క్లాష్‌తో నష్టం ఎవరికి ?

ఒకవేళ ఈ క్లాష్ జరగడం గనక పక్కా అయితే నష్టం ఎవరికి? అనేది మరో ప్రశ్న. 'వార్ 2' సినిమాలో ఇద్దరు క్రేజీ స్టార్స్ కలిసి నటిస్తున్నారు. అందులోనూ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడంతో హిందీ, తెలుగు భాషల్లో ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కానీ 'కూలీ' తెలుగు మార్కెట్‌పై 'వార్ 2' ఎఫెక్ట్, అదేవిధంగా 'వార్ 2' తమిళ మార్కెట్ పై 'కూలీ' ఎఫెక్ట్ గట్టిగానే పడతుంది. కానీ ఈ రెండు సినిమాలకు కూడా తెలుగు మార్కెట్ కీలకం. 

సాధారణంగా రజనీకాంత్ నటించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సినిమాలకు పెద్దగా పోటీని ఇవ్వదని చెప్పవచ్చు. కానీ 'కూలీ' సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ తారాగణం ఉండటం, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం వంటివి ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్. కాబట్టి 'కూలీ'కి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. 'వార్ 2'లో తెలుగులో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కలెక్షన్స్ అదరగొట్టడం ఖాయం. మరి ఇందులో ఏ సినిమా తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకుంటుంది? అంటే అది కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ రెండు సినిమాలు 1000 కోట్ల వసూళ్లు సాధించగల సామర్థ్యం ఉన్న చిత్రాలే. ఒకేరోజు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. మరి ఏ సినిమా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget