అన్వేషించండి

Maruti E Vitara: 500 km రేంజ్‌, 7 ఎయిర్‌బ్యాగులు, పవర్‌ఫుల్‌ ఫీచర్లు - మారుతి మొదటి e-SUV లాంచింగ్‌కు రెడీ

Maruti Suzuki First EV SUV: మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ SUVగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్‌ను ఆధునిక ఫీచర్లతో డిజైన్‌ చేశారు.

Maruti E Vitara Launching Soon: భారతీయుల అభిమాన కార్‌ల తయారీ కంపెనీ మారుతి సుజుకి, తన మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ SUV "ఇ-విటారా"ను ఈ నెలలోనే (ఏప్రిల్‌ 2025) భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ SUVని ఇటీవల ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శనకు పెట్టింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ SUV (Sport Utility Vehicle), స్పోర్ట్స్‌ కార్‌ ప్రియులను అమితంగా ఆకర్షించింది.

మారుతి సుజుకి బ్రాండ్‌ నుంచి వస్తున్న ఈ EV, కంపెనీ హార్టెక్ట్ ఇ-ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పని చేస్తుంది. చాలా ఆధునిక సాంకేతికతలు & భద్రత లక్షణాలతో ఈ కార్‌ను డిజైన్‌ చేశారు. శక్తిమంతమైన బ్యాటరీ ప్యాక్ & లాంగ్‌ రేంజ్‌ కారణంగా ఇది భారతీయ యూజర్లకు గొప్ప ఆప్షన్‌ కావచ్చు.

పవర్‌ఫుల్‌ బ్యాటరీ & లాంగ్‌ రేంజ్‌ (E-Vitara Battery & Range)
మారుతి సుజుకీ ఇ-విటారా (Maruti Suzuki e Vitara)లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ ఉంటాయి. మొదటి బ్యాటరీ ఆప్షన్‌తో ఇది 141 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది & 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. రెండో బ్యాటరీ ఆప్షన్‌తో ఈ e-SUV 171 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది & ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. రెండు బ్యాటరీ వేరియంట్లు 189 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్‌ చేస్తాయి.

ఎక్స్‌టీరియర్‌ లుక్‌ (E-Vitara Exterior Look)
ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV ని వివిధ రకాల LED డేటైమ్ రన్నింగ్ లైట్స్‌తో (DRLs) అలంకరించారు, అవి కార్‌ లుక్‌ను స్టైలిష్‌గా మార్చాయి. ముందు భాగంలో ఖాళీలతో కూడిన గ్రిల్ ఉంది, దానిపై మారుతి పెద్ద లోగో ఉంటుంది. ఈ కారు 10 విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి, కస్టమర్లు తమకు నచ్చిన రంగును ఎంచుకునేందుకు ఎక్కువ కలర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి.

ఇంటీరియర్ లుక్‌ & కంఫర్ట్ (E-Vitara Interior Look & Comfort)
మారుతి ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV లోపలి భాగంలోకి వస్తే, విలాసవంతంగా కనిపిస్తుంది & సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో 4 డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఆప్షన్స్‌ ఉన్నాయి. కార్‌ క్యాబిన్‌ ప్రీమియం కార్‌లతో పోటీ పడుతుంది, లుక్‌ సూపర్‌గా కనిపిస్తోంది. ఈ కారులో స్ప్లిట్-ఫోల్డింగ్ సీట్లు ఉన్నాయి, అవసరమైనప్పుడు వీటిని మడతపెట్టి ఎక్కువ లగేజీ స్పేస్‌ పొందవచ్చు. అంతేకాదు, ఇ-విటారాలో డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పని చేస్తుంది.

భద్రత & ఆధునిక ఫీచర్లు (E-Vitara Safety & Features)
ఈ ఎలక్ట్రిక్ SUVలో ADAS లెవెల్ 2 టెక్నాలజీ వల్ల కారును మరింత సురక్షితంగా & అధునాతనంగా మారింది. దీనికి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉంది, ఇది వేగాన్ని ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ కారును సరైన లైన్‌లో నడిపిస్తుంది. ఇంకా, ప్యాసింజర్ల భద్రత కోసం ఈ కారులో అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి, మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఇ-విటారా వేరియంట్‌లలో  7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

వేరియంట్లు & ధర (E-Vitara Variants & Price)
మారుతి ఇ-విటారా డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేర్వేరు వేరియంట్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ SUV అంచనా ధర రూ. 20 లక్షల  (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Botsa Political Legacy: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
Jana Sena MLA Arava Sridhar controversy: జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
Arijit Singh retirement: షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
AA22 Movie Update : దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

YCP Leaks Janasena MLA Videos | జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు | ABP Desam
Sunil Gavaskar About T20 World Cup | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు
Washington Sunder Fitness Update | వాషింగ్టన్ సుందర్ ఫిట్ నెస్ అప్డేట్
Tilak Varma in T20 World Cup | వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అందుబాటులో తిలక్ వర్మ ?
Nat Sciver Brunt Century WPL 2026 | మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa Political Legacy: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
Jana Sena MLA Arava Sridhar controversy: జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
Arijit Singh retirement: షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
AA22 Movie Update : దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
WhatsApp is not Secure: వాట్సాప్ సురక్షితం కాదా? పైరసీపై బాంబాలు పేల్చిన ఎలాన్‌ మస్క్, పావెల్ దురోవ్!
వాట్సాప్ సురక్షితం కాదా? పైరసీపై బాంబాలు పేల్చిన ఎలాన్‌ మస్క్, పావెల్ దురోవ్!
Liver Problems : రాత్రుళ్లు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీ కాలేయం చెడిపోయిందని తెలిపే సంకేతాలివే
రాత్రుళ్లు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీ లివర్ చెడిపోయిందని తెలిపే సంకేతాలివే
Supreme Court on Acid Attack:
"నిందితుల ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారంగా ఇవ్వండి" యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు సంచలన సూచన!
Bha Bha Ba OTT : తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget