అన్వేషించండి

కారు కొనాలనుకుంటున్నారా? స్విఫ్ట్‌ నుంచి వాగన్‌ ఆర్‌ వరకు మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

మార్చి 2026లో మారుతి సుజుకి కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. స్విఫ్ట్‌, బ్రెజ్జా, వాగన్‌ ఆర్‌, ఆల్టో K10 వంటి మోడళ్లపై రూ.50,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Maruti Suzuki Car Offers March 2026: కార్‌ కొనాలని ప్లాన్‌ చేస్తున్న వారికి ఇది మంచి సమయం కావొచ్చు. దేశంలోనే అతి పెద్ద కార్‌ తయారీ కంపెనీ మారుతి సుజుకి, ఈ నెల (మార్చి 2026)లో, తన అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మే కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా... స్విఫ్ట్‌, బ్రెజ్జా, వాగన్‌ ఆర్‌, ఆల్టో K10 వంటి జనం మెచ్చిన మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులు ఉన్నాయి.

ఈ ఆఫర్లలో క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌, స్క్రాప్‌ బెనిఫిట్‌, కార్పొరేట్‌ ఆఫర్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని మోడళ్లపై మొత్తం ప్రయోజనం రూ.50,000 వరకు చేరుతోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మారుతి స్విఫ్ట్‌పై భారీ తగ్గింపు

ఈ నెలలో మారుతి అరేనా లైనప్‌లో అత్యధిక ఆఫర్‌ మారుతి స్విఫ్ట్‌ కారుపైనే ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌పై మొత్తం రూ.50,000 వరకు ప్రయోజనం లభిస్తోంది.

ప్రత్యేకంగా AMT వేరియంట్‌పై రూ.25,000 క్యాష్‌ డిస్కౌంట్‌,  రూ.20,000 వరకు ఎక్స్చేంజ్‌ బోనస్‌ లేదా రూ.25,000 వరకు స్క్రాప్‌ బెనిఫిట్‌, రూ.5,000 కార్పొరేట్‌ ఆఫర్‌ ఉన్నాయి.

మాన్యువల్‌ వేరియంట్లపై క్యాష్‌ డిస్కౌంట్‌ కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మారుతి స్విఫ్ట్‌ ధర రూ.5.79 లక్షల నుంచి రూ.8.80 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉంది.

మారుతి బ్రెజ్జాపై రూ.45,000 వరకు ప్రయోజనం

ప్రముఖ SUV అయిన మారుతి బ్రెజ్జాపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. బేస్‌ వేరియంట్‌ LXi తప్ప మిగతా అన్ని వేరియంట్లపై రూ.45,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.

ఇందులో.. రూ.15,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.20,000 వరకు ఎక్స్చేంజ్‌ బోనస్‌ లేదా రూ.25,000 వరకు స్క్రాప్‌ బెనిఫిట్‌, రూ.5,000 కార్పొరేట్‌ ఆఫర్‌ కలిసి ఉన్నాయి. 

బేస్‌ LXi వేరియంట్‌కు రూ.10,000 వరకు ఎక్స్చేంజ్‌ బోనస్‌ మాత్రమే ఉంది. ప్రస్తుతం బ్రెజ్జా ధర రూ.8.26 లక్షల నుంచి రూ.13.01 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉంది.

వాగన్‌ ఆర్‌, ఆల్టో K10పై కూడా ఆఫర్లు

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన మారుతి వాగన్‌ ఆర్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై మొత్తం రూ.42,500 వరకు ప్రయోజనం పొందొచ్చు.

అలాగే మారుతి ఆల్టో K10పై కూడా రూ.42,500 వరకు తగ్గింపు ఉంది. ఈ చిన్న కార్‌ ప్రస్తుతం రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) అందుబాటులో ఉంది.

ఎకో, సెలెరియోపై కూడా తగ్గింపులు

మారుతి ఎకో వాన్‌ & సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్లపై కూడా రూ.42,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లలో కూడా క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌, స్క్రాప్‌ బెనిఫిట్‌ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

విక్టోరిస్‌, S ప్రెస్సోపై ఆఫర్లు

మారుతి విక్టోరిస్‌ మోడల్‌పై రూ.40,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో ముఖ్యంగా లాయల్టీ బెనిఫిట్‌ కూడా అందిస్తోంది.

దేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే కార్లలో ఒకటైన మారుతి S ప్రెస్సోపై రూ.37,500 వరకు ఆఫర్‌ ఉంది.

ఎర్టిగా, డిజైర్‌పై మాత్రం చిన్న ఆఫర్‌

పాపులర్‌ MPV అయిన మారుతి ఎర్టిగాపై ఈ నెలలో రూ.5,000 కార్పొరేట్‌ ఆఫర్‌ మాత్రమే ఉంది. అదే విధంగా మారుతి డిజైర్‌ సెడాన్‌పై రూ.2,500 కార్పొరేట్‌ బెనిఫిట్‌ మాత్రమే అందిస్తున్నారు.

కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయం

ఈ ఆఫర్లు ప్రతి నగరాన్ని బట్టి  కొంచెం మారవచ్చు. అలాగే డీలర్‌ దగ్గర ఉన్న స్టాక్‌ ఆధారంగా కూడా ఆఫర్లు మారే అవకాశం ఉంది. అందుకే కార్‌ కొనాలనుకునే వారు ముందుగా తమకు దగ్గరలో ఉన్న మారుతి అరేనా షోరూమ్‌లో వివరాలు తెలుసుకోవడం మంచిది.

మొత్తంగా చూస్తే, మార్చి నెలలో మారుతి కార్లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్విఫ్ట్‌, బ్రెజ్జా కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి అవకాశం కావొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ
EV కొనాలనుకుంటున్నారా? BaaS స్కీమ్‌తో లక్షల రూపాయలు ఆదా - పూర్తి జాబితా ఇదే
ఖరీదైన ఎలక్ట్రిక్‌ కారును కూడా చాలా చవగ్గా కొనే మార్గముంది - ఈ ఒక్క ప్లాన్‌ తీసుకుంటే చాలు!
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Triumph 350cc రేంజ్‌పై మరో ధరల భారం - ఏ మోడల్‌కు ఎంత పెరిగిందో తెలుసా?
Triumph బైక్‌ల రేట్లు మళ్లీ పెంపు - రెండు నెలల్లో రెండోసారి షాక్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget