By: Arun Kumar Veera | Updated at : 05 Apr 2025 03:41 PM (IST)
క్యాన్సిల్డ్ చెక్ రూల్ క్యాన్సిల్డ్ ( Image Source : Other )
EPF Withdrawal New Rules 2025: గత కొంతకాలంగా EPFO చందాదార్లు ఒకదాని వెంట మరొకటి శుభవార్తలు వింటున్నారు. తాజాగా, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation) "ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్" (EPF Fast track claim settlement) ద్వారా తన మెంబర్లకు మరో భారీ ఊరట కల్పించింది. తద్వారా, ఆన్‌లైన్‌లో నగదు ఉపసంహరణ మరింత సులభంగా మారింది.
8 కోట్ల మందికి ప్రయోజనం
ఇంతకుముందు, ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా (EPF Withdrawal Online) EPF ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్ (Cancelled bank check) అప్‌లోడ్ చేయాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు ఆ అవసరం లేదు. అంతేకాదు, బ్యాంక్ ఖాతాను సంబంధింత కంపెనీ యాజమాన్యం ధృవీకరించాల్సిన అవసరాన్ని కూడా EPFO తప్పించింది. ఇది, "ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్". దీంతో, దాదాపు ఎనిమిది కోట్ల మంది EPFO చందాదార్లకు ఊరట లభించినట్లైంది. ఈ వెసులుబాట్లపై, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ (Union Ministry of Labour) గత గురువారం (27 ఏప్రిల్ 2025) నాడు ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం, ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (Provident Fund account)లోని డబ్బు విత్‌డ్రా చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే UAN (Universal Account Number) లేదా PF అకౌంట్ నంబర్‌తో లింక్ చేసిన బ్యాంక్ చెక్‌ను (క్యాన్సిల్ చేసిన చెక్) ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత, ఆ ఉద్యోగి బ్యాంక్ ఖాతా వివరాలనుల కంపెనీ యాజమాన్యం కూడా ధృవీకరించాలి. ఇది, రెండు అంచెల ప్రక్రియ, ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే పీఎఫ్ డబ్బు సంబంధిత ఉద్యోగి చేతికి వస్తుంది. ఇకపై, ఈ తతంగం ఏదీ ఉండదని, క్యాన్సిల్డ్ చెక్ అప్‌లోడ్ చేసే రూల్‌ను పూర్తిగా తొలగించినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణల్ని తగ్గించగలదు.
సంవత్సరం క్రితం పైలెట్ ప్రాజెక్ట్
వాస్తవానికి, సంవత్సరం క్రితం, 2024 మే 28న పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా, KYC పూర్తి చేసిన కొందరు ఉద్యోగులను ఎంపిక చేసి, వాళ్ల వరకు ఈ నిబంధనను తొలగించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ ప్రక్రియ విజయవంతమైందని, దాదాపు కోటి 70 లక్షల మంది సభ్యులు ప్రయోజనం పొందారని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇప్పుడు EPFO చందాదార్లు అందరికీ ఈ ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. UANతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసే సమయంలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది & ఇప్పుడు ఆ భారం ఉద్యోగులపై ఉండదు.
లో-క్వాలిటీ ఇమేజ్‌ల అప్‌లోడింగ్
పీఎఫ్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సమయంలో, కొంత మంది మెంబర్లు క్వాలిటీ లేని చెక్ ఇమేజ్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో, ఆ క్లెయిమ్ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతున్న కేస్‌లు కూడా ఉన్నాయి. దీనిని నివారించడానికి కూడా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు, UANతో లింక్ అయిన బ్యాంక్ ఖాతాను మార్చుకునే ప్రక్రియ కూడా సులభం అయింది. EPFO పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, సంబంధిత సెక్షన్‌లోకి వెళ్లి కొత్త బ్యాంక్ ఖాతా నంబర్, IFSC వివరాలు ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఆధార్-ఆధారిత OTPతో సులువుగా అథంటికేషన్ పూర్తి చేయొచ్చు & బ్యాంక్ ఖాతాను మార్చుకోవచ్చు.
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!