Vijay Deverakonda Rashmika : టీటీడీ టెంపుల్ దర్శించిన విరోష్ కపుల్ - ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన కొత్త జంట
Virosh Couple : విజయ్, రష్మిక జంట హైదరాబాద్‌లో టీటీడీ టెంపుల్‌ను దర్శించుకున్నారు. స్వామి ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత అభిమానులకు స్వీట్స్ అందజేశారు.

Virosh Couple Visited TTD Temple In Hyderabad : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక కపుల్ హైదరాబాద్‌లోని టీటీడీ టెంపుల్ దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆలయానికి కొత్త జంట వెళ్లగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు విరోష్ కపుల్. వీరి వెంట విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు.
ఆలయ దర్శనం అనంతరం బయటకు వచ్చిన విరోష్ కపుల్‌కు ఫ్యాన్స్ విషెష్ తెలిపారు. ఫ్యాన్స్‌కు అభివాదం తెలిపిన విజయ్, రష్మిక వారికి స్వీట్స్ పంచిపెట్టారు. ఇవి తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read : గ్లోబల్ స్టేజిపైకి 'రామాయణ్'... శాన్ డియాగో కామిక్ కాన్‌లో రణబీర్ సినిమా ట్రైలర్ విడుదల
తమ పెళ్లి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంపిణీ చేశారు విరోష్ కపుల్. అలాగే, ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లోని ఆలయాల్లో అన్నదానం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఉదయం హిందూ సంప్రదాయ ప్రకారం సాయంత్రం కడువ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేయగా ట్రెండ్ అవుతున్నాయి.
పెళ్లి తర్వాత కొత్త జంట ప్రధాని మోదీ సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసి తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ నెల 4న హైదరాబాద్ తాజ్ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ హాజరు కానున్నారు.
























