(Source: ECI/ABP News/ABP Majha)
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Samantha rapid fire interview: నాగ చైతన్యకు బహుమతులు ఇవ్వడానికి సమంత బోలెడు డబ్బులు ఖర్చు చేసిందా? ఆవిడ లేటెస్ట్ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఆవిడ ఏం చెప్పారో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య, సమంత మధ్య బంధం ముగిసింది. ఇప్పుడు ఇద్దరి దారులు వేర్వేరు అయ్యాయి. ఒకరి గురించి మరొకరు అసలు మాట్లాడడం లేదు. కానీ, ఇద్దరి మాటల్లో మరొకరి ప్రస్తావన బయట పడుతోందని కనుక చెప్పక తప్పడం లేదు. సమంత ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'. అందులో వరుణ్ ధావన్ హీరో. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇద్దరూ కలిసి ఒక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ చేశారు. అందులో సామ్ చెప్పిన ఓ ఆన్సర్ చైతు గురించి అని అర్థం అవుతోంది.
నా మాజీ కోసం ఖరీదైన గిఫ్టులు కొన్నా - సమంత
'అసలు ఉపయోగము లేని దానికోసం ఎప్పుడైనా భారీ మొత్తాన్ని ఖర్చు చేశావా?' అని సమంతను వరుణ్ ధావన్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ''నా మాజీ కోసం నేను కొని ఇచ్చిన ఖరీదైన గిఫ్టులు'' అని చెప్పారు సమంత. అక్కడ అక్కినేని నాగ చైతన్య ప్రస్తావన ఆమె తీయలేదు. కానీ మాజీ అంటే మొదటగా అందరికీ గుర్తు వచ్చేది చైతూనే. ఆయనతో విడాకుల తర్వాత నుంచి ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు.
చైతన్యతో పెళ్లికి ముందు సమంత ఇద్దరు ముగ్గురు హీరోలతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఎప్పుడూ వాటిని ఆవిడ ధ్రువీకరించలేదు. తనకు ప్రేమ కథలు ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. సో నాగచైతన్యకు ఆవిడ గిఫ్టులు కొని ఇచ్చారు అని అనుకోవాలి. ఇదే ఇంటర్వ్యూలో చివరిగా ఎవరికి మెసేజ్ చేశారో చెప్పడంతో పాటు ఆ మెసేజ్ పైకి చదివి వినిపించమని అడగగా... సమంత చెప్పడానికి ఇష్టపడలేదు. బదులుగా పచ్చిమిర్చి తిన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ మొదట... తన జీవితంలో ఏదీ దాచడానికి లేదని, దాచింది ఏదీ లేదని చెప్పడం విశేషం. నిజంగా చైతన్యకు సమంత ఖరీదైన బహుమతులు కొన్నారో లేదో కానీ ఈ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ వల్ల 'సిటాడెల్: హానీ బన్నీ'కి విపరీతమైన పబ్లిసిటీ ఇంకోసారి లభించిందని చెప్పవచ్చు.
Also Read: కృష్ణ కృష్ణా... 'గల్లా'పెట్టెలో డబ్బు గల్లంతు - ప్రశాంత్ వర్మకు, బుర్రాకు అంత ఇవ్వడం వర్తేనా?
When spies get spy-cy, it's very rapid, very fiery!🔥#CitadelHoneyBunnyOnPrime, watch now! pic.twitter.com/dNXZx5D55g
— prime video IN (@PrimeVideoIN) November 23, 2024
శోభితతో పెళ్లికి సిద్ధమవుతున్న నాగచైతన్య
సమంతతో వేరుపడిన తర్వాత తెలుగు అమ్మాయి, హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న శోభిత ధూళిపాళతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కథ పెళ్లి పీటలకు చేరింది. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ నందు జరిగే వివాహ వేడుకలు నాగచైతన్య శోభిత భార్యాభర్తలు కానున్నారు. ఇప్పటికే వివాహాది శుభ లేఖలు, ఆహ్వానాలు అందరికీ అందించారు. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేయడానికి అక్కినేని ఫ్యామిలీ నిర్ణయించింది.