అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Prashant Varma: కృష్ణ కృష్ణా... 'గల్లా'పెట్టెలో డబ్బు గల్లంతు - ప్రశాంత్ వర్మకు, ‌బుర్రాకు అంత ఇవ్వడం వర్తేనా?

Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించిన సంగతి తెలిసిందే. ఆ కథకు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా చరిత్రలో‌ ఓ సినిమాకు మాటలు రాసినందుకు గాను కోటి రూపాయల పారితోషికం అందుకున్న మొదటి రచయితగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రికార్డ్ సృష్టించారు. మరి, ఓ కథకు రెండు కోట్లు అందుకున్న రైటర్ ఎవరో తెలుసా? ప్రశాంత్ వర్మ. అవును... 'దేవకీ నందన వాసుదేవ' చిత్రానికి కథ ఇచ్చినందుకు గాను ఆయనకు రెండు కోట్ల రూపాయల పారితోషికం అందిందని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖబర్. మరి అంత ఇవ్వడం వర్తేనా? అంటే...‌‌‌ కాదు వర్మ కాదు అంటోంది ఇండస్ట్రీ. 

హాలీవుడ్ ట్విస్ట్... మైథాలజీ టచ్...
ఇలా చేశావ్ ఏంటి ప్రశాంత్ వర్మ!
'దేవకీ నందన వాసుదేవ' విడుదలకు ముందు ప్రశాంత్ వర్మ కథ ఇచ్చిన సినిమా అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. మైథాలజీ నేపథ్యంలో కంసుడు, కృష్ణుడు అంటూ సినిమా తీయడంతో జనాలలో కూడా ఆసక్తి ఏర్పడింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' సినిమా భారీ విజయం కూడా ఆయన మీద పబ్లిసిటీ చేయడానికి ఒక రీజన్ అయ్యింది. కట్ చేస్తే... సినిమా బిగ్గెస్ట్ మైనస్సుల్లో ఒకటిగా కథ కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

ప్రశాంత్ వర్మ రాసిన కథలో కొత్తదనం లేదు... ఒక్క ట్విస్ట్ తప్ప. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఆమెను కష్టాల కడల నుంచి బయట పడేయడానికి యుద్ధం చేయడానికి సిద్ధమైన హీరోలను తెలుగు ప్రేక్షకులు చాలామంది చూశారు. ఈ సినిమా కూడా అంతే! అయితే, ఇటువంటి రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ... ఆ విషయంలో కూడా స్వేచ్ఛను తీసేసుకున్నారు. 

What happened to Monday అని 2017లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. హాలీవుడ్ సినిమాలో ట్విస్ట్ తీసుకుని, దానికి కృష్ణుడు - కంసుడు అంటూ తనకు తోచిన రీతిలో కథ రాసేశారు ప్రశాంత్ వర్మ. పురాణాల ప్రకారం కంసుడికి, కృష్ణుడు మేనల్లుడు అవుతాడు. కానీ ప్రశాంత్ వర్మ రాసిన కథలో కంస రాజు మేనకోడలిని కృష్ణ ప్రేమిస్తాడు. పురాణాలను తనకు నచ్చినట్టు మార్చేశారు. ఆ ఒక్క ట్విస్ట్ తప్ప సినిమా కథలో ఎగ్జైట్ చేసే పాయింట్ మరొకటి లేదు. దాంతో ఆయనకు రెండు కోట్లు ఇవ్వడం వర్త్ కాదు వర్మ అని ఇండస్ట్రీలో ఆఫ్ ది రికార్డ్ డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఈ తరహా కథలు అయితే 33 కాదు 3 ఉన్నా సరే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారనే విషయాన్ని ప్రశాంత్ వర్మ గమనించడం మంచిది. 

'దేవకీ నందన వాసు దేవ' చిత్రానికి కథ ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ రెండు కోట్ల రూపాయలు తీసుకుంటే... అగ్ర రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాసినందుకు కోటి రూపాయలు తీసుకున్నారు అని టాక్. కామెడీ టాక్ జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ రాశారు. జబర్దస్త్ స్కిట్స్ కంటే ఘోరంగా ఉన్న ఆ పంచ్ డైలాగ్స్ పేలలేదు. అది పక్కన పెడితే... ఎమోషనల్ డైలాగుల్లో బుర్రా రాసినవి అర్థంకాక బుర్ర‌ పట్టుకున్నారు జనాలు. రైటర్లకే మూడు కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఈ సినిమాకు... మూడు కోట్ల రూపాయలలో 10% అంటే... 30 లక్షల కూడా మొదటి రోజు రాలేదు. ఆ మాటకు వస్తే థియేటర్లకు ఎదురు డబ్బులు కట్టారని, సినిమా చూసేందుకు జనాలు రాకపోయినా సరే రెంట్ కట్టాలి కనుక నిర్మాత చేత డబ్బులు వదిలాయని గుసగుస.

Also Readమహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే షోస్ క్యాన్సిల్, కలెక్షన్స్‌ అయితే మరీ ఘోరం

ఈ 'దేవకీ నందన వాసుదేవ' ఫలితం చూసిన తర్వాత ప్రశాంత్ వర్మతో పాటు హీరో అశోక్ గల్లా కూడా కళ్ళు తెరిచే కంటెంట్ ఉన్న కథలను జనాలకు అందించాలని గుర్తిస్తే మంచిది. లేదంటే మళ్లీ ఇటువంటి డిజాస్టర్లు వస్తాయి. దర్శకుడు అర్జున్ జంధ్యాల సైతం గురువు బోయపాటి తరహాలో యాక్షన్ సీన్లు తీయడం స్క్రీన్ మీద రక్తపాతాలు సృష్టించడం మానేసి... ఆడియన్స్ పల్స్ ఏమిటి? అనేది గమనించి సినిమాలు తీయడం ఉత్తమం. హీరోలు అందరికీ, కథలు అన్నింటికీ రక్తపాతాలు పనికి రావు.

Also Readదేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget