Devaki Nandana Vasudeva: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
Ashok Galla Next Movie: అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు? అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకంటే... 'దేవకీ నందన వాసుదేవ'కు ఓపెనింగ్ డే డిజాస్టర్ టాక్ వచ్చింది.
సూపర్ హిట్ సినిమా తీయడానికి, ఆడియన్స్ చేత యాక్సెప్టెన్స్ రావడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాకింగ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే సరిపోదు... పర్సనాలిటీకి తగ్గ కథ, క్యారెక్టర్ ఎంపిక చేసుకోవడం ఇంపార్టెంట్. లేదంటే ఫాన్స్ కూడా సపోర్ట్ చేయరని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ కూడా 'దేవకీ నందన వాసుదేవ' సినిమాను పట్టించుకోలేదు. తమ అభిమాన హీరో మేనల్లుడి ఫిల్మ్ అని ఇంట్రెస్ట్ చూపించలేదు. మొదటి రోజు థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. దాంతో పలు థియేటర్లలో షోలు క్యాన్సల్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది.
'దేవకి నందన వాసుదేవ'తో పాటు విశ్వక్ సేన్ కొత్త సినిమా 'మెకానిక్ రాకీ', సత్యదేవ్ - డాలీ ధనుంజయ నటించిన 'జీబ్రా' సైతం విడుదల అయ్యాయి. ఆ రెండిటికీ ఉన్న మినిమం రెస్పాన్స్ కూడా మహేష్ మేనల్లుడి సినిమాకు లేదు. దేవకీ నందన వాసుదేవ ప్రోమోలు గానీ, పాటలు గానీ థియేటర్లకు జనాల్ని రప్పించలేదు. సినిమాలో విషయం ఉందనే నమ్మకాన్ని ఇవ్వలేదు.
థియేటర్ల నుంచి 'దేవకీ నందన వాసుదేవ' సినిమాకు మొదటి రోజు ఒక్క రూపాయి షేర్ కూడా నిర్మాతలకు రాలేదని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రూపాయి రాలేదు సరి కదా... సినిమా ప్రదర్శించినందుకు కొన్ని థియేటర్లకు ఎదురు డబ్బులు కట్టాల్సి వచ్చిందట.
హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ లో పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ లో శుక్రవారం ఉదయం 10.20 గంటలకు షో వేశారు. కేవలం 5 మంది మాత్రమే టికెట్లు కొన్నారు. థియేటర్లో సినిమా చూసింది ఆ ఐదుగురే. శుక్రవారం హైదరాబాద్ సిటీ అంతట పలు మల్టీప్లెక్స్ లలో షోలు షెడ్యూల్ చేశారు. అయితే చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఒక్క టికెట్టు, రెండు టికెట్లు తెగడంతో ఏం చేయాలో పాలుపోక, షోలు వేస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కనుక మల్టీప్లెక్స్ యాజమాన్యాలు క్యాన్సిల్ చేశారని టాక్. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఏరియాలలో ఇదే పరిస్థితి. నెగిటివ్ షేర్ రావడంతో ఎదురు డబ్బులు కట్టారని టాక్.
Also Read: జీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో గనుక మొదటి రోజు థియేటర్లకు మినిమం క్రౌడ్ వస్తుందని అనుకుంటే పొరపాటు అని 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ ఏడాది మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో' సినిమా వచ్చింది. విమర్శకుల నుంచి ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. ఓటీటీలో వచ్చిన తర్వాత బావుందని కొంతమంది కామెంట్లు కూడా చేశారు. అయితే థియేటర్లకు వచ్చిన జనాలు మాత్రం చాలా తక్కువ మంది. ఫస్ట్ డే జీరో షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ బాబు చెప్పిన గతంలో ఒక సినిమా వేడుకలో మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన సినిమా బాలేదంటే అభిమానులు కూడా థియేటర్లకు రారు అని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. మహేష్ అలా అన్నారు కానీ... ఆయన సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు మినిమం 50 కోట్ల రూపాయల ఓపెనింగ్ ఉంటుంది. అలాగని మహేష్ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలు అందరినీ అభిమానులు ఆదరిస్తారని అనుకుంటే పొరపాటే. అందుకు 'మా నాన్న సూపర్ హీరో', 'దేవకి నందన వాసుదేవ' సినిమాలే ఎగ్జాంపుల్స్. అశోక్ గల్లా ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్, రివ్యూస్ ఎనలైజ్ చేసుకుని నెక్స్ట్ సినిమా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. దేవకీ నందన వాసుదేవ డిజాస్టర్ కావడంతో ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా మీద ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?