Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
శ్రీరాామనవమి 2023: మార్చి 30 గురువారం శ్రీరామనవమి..ఈ సందర్భంగా ఆ రోజు దేవుడి దగ్గర దీపం వెలిగించి ఈ శ్లోకాలు చదువుకుంటే మంచిదని చెబుతున్నారు పండితులు
Sri Rama Navami 2023: భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువల కలబోత శ్రీరాముడు అని చెబుతారు పండితులు. అందుకే రామనామాన్ని స్మరించినా, ఆ శ్లోకాలను పఠించినా అత్యుత్తమ ఫలితాలు పొందుతారని విశ్వాసం. శ్రీరామ నవమి సందర్భంగా ఈ శ్లోకాలు మీరు చదువుకోండి..పిల్లలకు నేర్పించండి. కేవలం రామ నవమి రోజు మాత్రమే కాదు..నిత్యం చదువుకుంటే మంచి ఫలితాలు పొందుతారని సూచిస్తున్నారు పండితులు.
శ్రీరాముడి ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి
శ్రీ రామ ధ్యాన శ్లోకాలు: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే!
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
రామ మూల మంత్రం - ఓం శ్రీ రామాయ నమః
రామ తారక మంత్రం - శ్రీరామ జయ రామ జయ జయ రామ
రామ గాయత్రీ మంత్రం
ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,
తన్నో రామ ప్రచోదయాత్
రామ ధ్యాన మంత్రం
ఓం అపాదమపహర్తారం దాతారం సర్వసంపదమ్
లోకాభిరామం శ్రీరామం భూయో-భూయో నమామ్యహమ్
కోదండ రామ మంత్రం
శ్రీరామ జయ రామ కోదండ రామ॥
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి॥
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥