అన్వేషించండి
SCR Sabarimala Special Trains: ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
Special Trains: మండల దీక్ష పూర్తిచేసి స్వామి దర్శనానికి బయలులేరే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల కోసం 62 ప్రత్యేక రైళ్లు నడపనుంది

Sabarimala Special Trains
1/7

మండల మకరు విళక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ గతేడాది కన్నా ఈ ఏడాది భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మక మకరు విళక్కు సీజన్ మొదలైనప్పటి నుంచి మకర సంక్రాంతి జ్యోతి దర్శనం పూర్తయ్యేవరకూ భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. అందుకే అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ప్రయాణానికి సంబంధించి ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
2/7

శ్రీకాకుళం రోడ్ - కొల్లాం , విశాఖపట్నం-కొల్లాం మధ్య శబరిమలకు 44 ప్రత్యేక సర్వీసులుంటాయి. ఇవి డిసెంబరు 1 న ప్రారంభమై మండల మకరు విళక్కు సీజన్ పూర్తయ్యే డిసెంబరు 26 వరకూ కొల్లాంకు..అక్కడి నుంచి డిసెంబరు 27 తిరుగు ప్రయాణానికి ఉపయోగపడతాయి. మరోవైపు కాచిగూడ - కొట్టాయం, హైదరాబాద్ - కొట్టాయం మధ్య కూడా స్పెషల్ సర్వీసులున్నాయి.
3/7

ట్రైన్ నంబర్ 08539 - విశాఖ to కొల్లాం ట్రైన్ డిసెంబరు 4 నుంచి డిసెంబరు 26 వరకూ ప్రతి బుధవారం ట్రైన్ నంబర్ 08540 - కొల్లాం to విశాఖ ట్రైన్ సర్వీసు డిసెంబరు 5 నుంచి డిసెంబరు 27 వరకూ ప్రతి గురువారం
4/7

ట్రైన్ నంబర్ 08553 - శ్రీకాకుళం రోడ్డు to కొల్లాం ట్రైన్...డిసెంబరు 01 నుంచి డిసెంబరు 26 వరకూ ప్రతి ఆదివారం ట్రైన్ నంబర్ 08554 - కొల్లాం to శ్రీకాకుళం రోడ్డు డిసెంబరు 2 నుంచి డిసెంబరు 27 వరకూ ప్రతి సోమవారం
5/7

ట్రైన్ నంబర్ 07133 - కాచిగూడ to కొట్టాయం వరకూ వెళ్లే ఈ ట్రైన్...డిసెంబర్ 5, 12, 19 , 26 తేదీల్లో ఉంటుంది ట్రైన్ నంబర్ 07134 - కొట్టాయం to కాచిగూడ వచ్చే ఈ ట్రైన్ డేట్స్..డిసెంబర్ 6, 13, 20 , 27 ప్రతి శుక్రవారం
6/7

ట్రైన్ నంబర్ 07135 - హైదరాబాద్ to కొట్టాయం ట్రైన్ డిసెంబర్ 3, 10, 17, 24 & 31 తేదీల్లో..ప్రతి మంగళవారం ట్రైన్ నంబర్ 07136 - కొట్టాయం to హైదరాబాద్ మధ్య ఈ సర్వీస్ ప్రతి డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1వరకూ ప్రతి బుధవారం
7/7

ఈ సర్వీసులు భక్తులు వినియోగించుకుని సౌకర్యవంతంగా, సురక్షితంగా స్వామి దర్శనం చేసుకుని రావాలని
Published at : 26 Nov 2024 12:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion