అన్వేషించండి
Tirumala TTD Top Decisions: భక్తులకు 2, 3 గంటల్లో శ్రీవారి దర్శనం, అన్య మతస్తులు ఔట్ - టీటీడీ కీలక నిర్ణయాలివే
బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

భక్తులకు 2, 3 గంటల్లో శ్రీవారి దర్శనం- టీటీడీ నుంచి అన్య మతస్తులు ఔట్!
1/6

తిరుమలలోని అన్నమయ్య భవనంలో బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
2/6

టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
3/6

తిరుమలకు వచ్చే భక్తులకు 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని చర్చించారు.
4/6

తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను 3, 4 నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
5/6

తిరుమలలో గతంలో రాజకీయాలు మాట్లాడారని, ఇకనుంచి తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడేవారిపై, పార్టీల గురించి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
6/6

శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు అవకాశాలను పరిశీలించి వచ్చే సమావేశంలో రిపోర్టు ఇవ్వాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సభ్యులను ఆదేశించారు. తిరుపతి స్థానిక ప్రజలకు ప్రతి నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.
Published at : 18 Nov 2024 06:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఐపీఎల్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion