చాణక్య నీతి: వీళ్లని పడుకోనివ్వకూడదు



విద్యార్థి సేవకః పాస్థః క్షుధార్తో భయకారతః
భాణ్ణార్థీ చ ప్రతిహారీ సప్తనుప్తాన్ ప్రబోధయేత్



చాణక్యడు చెప్పిన ఈ శ్లోకం అర్థం ఏంటంటే...విద్యార్థులు, సేవకులు, పథికులు, ఆకలి బాధతో ఉన్నవారు, భయ భ్రాంతితో ఉన్నవారు, ద్వారపాలకుడు వీరు పడుక్కుంటే నిద్రలేపాలి



సాధారణంగా నిద్రపోతున్నవారిని లేపకూడదు అంటారు కదా మరి.. వీరిని పడుకోనివ్వవద్దని చాణక్యుడు ఎందుకు చెప్పినట్టు?



విద్యార్థులు చదువుకోవాల్సిన సమయంలో నిద్రపోరాదు



సేవకులు, కాపలావారు, ద్వారపాలకు...వీరు ఉన్నదే పరిరక్షణ కోసం..విధినిర్వహణలో ఉన్నప్పుడు నిద్రపోతే అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది



ఆకలితో పడుకున్నారు లేపండి అనేమాట తరచూ ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు.. ఆకలిబాధతో ఉన్నప్పుడు నిద్రపోరాదు



భయం, భ్రాంతితో ఉన్నవారు నిద్రపోతే నిద్రలో కూడా అదే ఆలోచనతో నిండిపోతారు..అందుకే భయ,భ్రాంతితో ఉన్నవారిని పడుకోనివ్వద్దని చెప్పాడు చాణక్యుడు



పథికులు అంటే ప్రయాణం చేసేవారు..ఎటో వెళుతూ మార్గమధ్యలో ఆగి నిద్రపోయేవారిని కూడా లేపాలని చెబుతాడు చాణక్యుడు..



ఇప్పుడంటే వాహనాలు ఉన్నాయి కానీ అప్పట్లో కాలినడగనే వెళ్లేవారు కదా...మధ్యలో ఎక్కువ సమయం విశ్రాంతికి కేటాయిస్తే గమ్యం చేరుకోవడం ఆలస్యం అవుతుంది..చీకటిపడితే ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని చాణక్యుడి ఉద్దేశం



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

ఈ హోలీ ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది

View next story