మీ రాశిప్రకారం హోలీ రోజు మీరు ధరించాల్సిన దుస్తుల రంగు ఏంటంటే!



మేష రాశి
మేష రాశి వారు శక్తివంతంగా, ఉద్వేగభరితంగా, ధైర్యంగా ఉంటారు. ఈ రాశి వారికి ఎరుపు, నారింజ, పసుపు రంగులు అనుకూలంగా ఉంటాయి.



వృషభ రాశి
వృషభ రాశివారు హోలీ రోజు గులాబీ, నీలం రంగు దుస్తులు ధరించాలి. ఈ రంగు ఈ రాశివారికి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.



మిథున రాశి
మిథున రాశికి చెందిన వ్యక్తులు తెలివైనవారు, బహుముఖ ప్రజ్ఞావంతులు. అందుకే పసుపు, ఆరెంజ్ రంగుల దుస్తులు ధరించడం వీరికి అనుకూలం.



కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు భావోద్వేగ పూరిత, సున్నితమైన స్వభావం కలవారు. వీరు హోలీ రోజు బ్లూ, పింక్ కలర్ దుస్తులు ధరించాలి. ఈ రంగులు వారి ప్రేమ స్వభావాన్ని సూచిస్తాయి.



సింహ రాశి
సింహరాశి వారు హోలీ రోజు ఎరుపు, ఆరెంజ్, గోల్డ్ కలర్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ రంగులు వీరి గంభీరమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి



కన్యా రాశి
హోలీ రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ, గోధుమ రంగు దుస్తులు ధరించడం అనుకూలం. వీరి స్వభావం ఆచరణాత్మకంగా ఉంటుంది. అందుకే ఈ హోలీ రోజు ఈ రంగులు ధరించడం మంచిది



తులా రాశి
తులా రాశి వారు దౌత్యానికి కేరాఫ్ అని చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉంటారు కానీ పనులు మాత్రం చక్కగా చక్కబెట్టేస్తారు. ఈ రాశివారు పింక్, బ్లూ కలర్స్ సరిగ్గా సరిపోతాయి.



వృశ్చిక రాశి
వృశ్చికం నీటి రాశి అంటారు. హోలీ రోజు ఈ రాశివారు నలుపు, మరూన్, ఉదా రంగులు ధరించడం మంచిది. వీరి లోతైన భావాలను ఈ రంగులు ప్రతిబింబిస్తాయి



ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఆశావాదులు, స్వేచ్ఛా స్ఫూర్తిని కలిగి ఉంటారు. హోలీ రోజు మీరు ప్రశాంతంగా కనిపించే తెలుపు రంగు ధరించడం మంచిది. ఇది మీ ప్రియమైన అనుభూతిని, ప్రకాశవంతమైన మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.



మకర రాశి
మకర రాశి వారు కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతంగా ఉంటారు. గ్రే, బ్లూ కలర్స్ వీరి స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. హోలీ రోజు ఈ రెండు రంగుల దుస్తులు వీరికి అనుకూలం



కుంభ రాశి
కుంభ రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువ. అందుకే ఈ రాశివారు హోలీ రోజు తమ హోలీ డు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే రంగులను ధరించాలి. ఊదారంగు వీరికి అనుకూలం



మీన రాశి
మీన రాశివారికి సానుభూతి చాలా ఎక్కువ. ఊహాత్మక , కళాత్మక స్వభావం వీరిది. ఈ రాశివారికి ఆకుపచ్చ, లావెండర్, ఎరుపు రంగులు హోలీ రోజు సరైనవి
Image Credit: Pixabay