ఈ సమయంలో బిక్షం వేయకూడదు



ఇంటిల్లిపాది భోజనానికి కూర్చున్నప్పుడు బిచ్చగాడు వస్తే తప్పనిసరిగా అయినా లేచి వేయాలి



ఆకలితో అలమటించేవారు ఆ సమయంలో భగవత్ స్వరూపులు



ప్రతి ఒక్కరిలో ఉండే భగవంతుని ఆత్మ ఆకలితో అలమటించకూడదని చెబుతారు



ఆత్మని బాధపెట్టకుండా బిక్షం వేయాలి



మరి ఏ సమయంలో బిక్షం వేయకూడదు అనే సందేహం వచ్చి ఉంటుంది కదా...



పితృకార్యాలు జరిగే సమయంలో సకల విధులు పూర్తయ్యేవరకూ గృహస్థుడు ఎవ్వరికీ బిక్షం వేయకూడదు



కార్యక్రమం అనంతరం కాకికి అన్నం పిడచ పెట్టి...గృహస్థుడు భోజనం చేసిన తర్వాత మాత్రమే బిక్షం వేయాలి



నోట్: కొన్ని పుస్తకాలు, కొందరు పండితులు చెప్పిన సూచనల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం