చాణక్య నీతి: ఎవరినైనా నమ్మేముందు మీరు ఆలోచించాల్సిన విషయాలివి



‘యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే నిగర్షణం ఛేదంతపతదనైః తథా చతుర్భిః
పురుషం పరీక్ష్యతే త్యాగేన్ శీలేన్ గుణేన్ కర్మణా’



చాణక్య నీతిలో ఉన్న ఈ శ్లోకంలో కొన్ని విలువైన సూత్రాలు చెప్పారు. మొదటి త్యాగం, రెండోది వారి పాత్ర, మూడోది లక్షణాలు, నాలుగోది కర్మలను వీక్షించడం.



ప్రతి ఒక్కరిలోనూ మంచి-చెడు రెండు లక్షణాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా సోమరితనం, గర్వం, తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఉన్న వ్యక్తులను అస్సలు నమ్మకండి



ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా ఉంటారో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారో వారెప్పుడు సన్మార్గంలో నడుస్తారని గుర్తించాలి. అలాంటి వారిని మాత్రమే విశ్వసించాలి.



మీరు ఓ వ్యక్తిని నమ్మేముందు వారిలో త్యాగం చేసే గుణం ఎంతవరకూ ఉందో పరీక్షించాలి.



ఎవరైతే ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన ఆనందాన్ని సైతం త్యాగం చేస్తారో అలాంటి వారు మీ బాధలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు.



ఎవరినైనా నమ్మేముందు ముందు ఆ వ్యక్తికి ఇంట్లో ఉన్న స్థానం ఏంటో గమనించాలి. ఇంట్లో ఎలా ఉంటారు - బయట ఎలా ఉంటారు, ఎలాంటి పనులు చేస్తారో తెలుసుకున్నాకే విశ్వశించాలి



డబ్బు కొందర్ని కలిపితే ఎక్కువమందిని విడదీసే ప్రయత్నం చేస్తుంది. బంధాల కన్నా డబ్బుకే విలువ ఎక్కువ ఇచ్చే రోజులివి..ఈ విషయంలో పరీక్షించిన తర్వాతే వారిని నమ్మండి



డబ్బు విషయంలో ఎలా పరీక్షించాలంటే..ముందు వారికి కొంత సొమ్ము అప్పుగా ఇవ్వండి..దాన్ని వారు సరైన సమయానికి మీకు తిరిగి ఇచ్చేస్తే వారిని నమ్మొచ్చు.



కొందరు వ్యక్తులు స్వార్థపూరిత ఆలోచనలతో తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. వారు తిరిగి డబ్బులు ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడరు..రేపు మాపు అంటూ కాలయాపన చేస్తారు..అలాంటి వ్యక్తులను ఎప్పటికీ నమ్మకూడదు



Images Credit: Pixabay