చాణక్య నీతి: ఈ గుణాలు ఉంటేనే భార్య అంటారు



సౌ భార్యా యా శుచిదక్షా సౌ భార్యా యా పతివ్రతా
సౌ భార్యా యా పతిప్రీతా సౌ భార్యా సత్యవాది



భార్య ఎలా ఉండాలో ఈ శ్లోకం ద్వారా వివరించాడు ఆచార్య చాణక్యుడు



పవిత్రంగా, కౌశలంగా, పతివ్రతగా, భర్త ఎడల అనురాగంతో, భర్తకి నిజమే చెప్పేదే భార్య అని అర్థం



చాణక్యుడి ఉద్దేశం ఏంటంటే.. తన ఆచరణ పవిత్రంగా, కౌశలంగా ఉంచుకున్న ఇల్లాలు పవిత్రంగా, భర్తకు ప్రేమానురాగాలు అందించేది...



ఎప్పుడూ అబద్ధాలు చెప్పనిదే నిజమైన భార్య అనిపించుకునేందుకు అర్హురాలు



అంతఃకరణ నిష్కళంకంగా ఉంచుకుని స్వచ్ఛమైన ఆలోచనలతో నిండి ఉండి ఇంటిని చక్కదిద్దుకునేదే భార్య



తనువు, మనస్సుతో, వాక్కుతో భర్తమీద అనురక్తి పెంచుకుని..భర్తకి అనుగుణంగా మారేదే భార్య



తన కర్తవ్యాన్ని, బాధ్యతలను స్వీకరించేది...భర్తకి ఎప్పుడూ నిజాలే చెప్పేదే నిజమైన భార్య అనిపించుకుంటుంది అంటాడు చాణక్యుడు



అనుమానాలు పుట్టించే మాటలు హాస్యానికి కూడా చెప్పనిదే భార్య అనిపించుకుంటుంది



నోట్: అప్పటి పరిస్థితుల ఆధారంగా స్త్రీ ఎలా ఉండాలో చాణక్యుడు రాసిన ఈ వివరాలను ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం



Images Credit: Pixabay